Bandla Ganesh: సు** కోసుకుంటా.. ము** మీద తంతారు.. యాంకర్‌తో బండ్ల గణేష్ అసభ్యకర వ్యాఖ్యలు
బండ్ల గణేష్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఈయన దాదాపు రెండు దశాబ్దాలుగా అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో తనదైన రీతిలో మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో విభిన్నమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు, ఈ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ నిత్యం ఏదో ఒక వివాదంలోనూ భాగం అవుతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన నోటి నుంచి కొన్ని ఊహించని మాటలు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

బ్లేడ్, రోజా గొడవ, పవన్‌తోనే
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో పలుమార్లు హాట్ టాపిక్‌గా మారారు. ఎన్నికల సమయంలో బ్లేడ్‌తో కోసుకుంటానంటూ, ఆ తర్వాత రోజాతో గొడవ పడి.. మళ్లీ ఆమెను కలిసి ఫొటో దిగడం, పవన్ - త్రివిక్రమ్ గురించి ఓ ఫోన్ సంభాషణ బయటకు రావడం, అభిమాన హీరో గురించి ఎలివేషన్స్ ఇవ్వడం.. వంటి వాటితో ఆయన పేరు సంచలనం అయింది.

బండ్లతో జాఫర్ ఇంటర్వ్యూ
గతంలో ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేసి.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసున్నాడు ప్రముఖ జర్నలిస్టు జాఫర్. ఈ మధ్య కాలంలో ఆయన 'Itlu mee Jaffar' అనే యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జాఫర్.. బండ్ల గణేష్‌తో చిట్ చాట్ నిర్వహించాడు.

భగవద్గీత.. ఖురాన్ అంటూ
సెలెబ్రిటీలతో చేసే ప్రతి ఇంటర్వ్యూలోనూ జాఫర్ తనదైన శైలిని కనబరుస్తుంటాడు. ఈ క్రమంలోనే నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌తో చిట్ చాట్ చేసే ముందు ఆయనను 'భగవద్గీత' మీద ప్రమాణం చేయమంటూ కండీషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న బండ్ల గణేష్.. జాఫర్‌ను ఖురాన్ మీద ప్రమాదం చేయమని చెప్పాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ వాడీ వేడీగానే ప్రారంభమైంది.

ముందు జాగ్రత్తగా కెమెరా
ఈ ఇంటర్వ్యూ ప్రారంభించే సమయంలో జర్నలిస్టు జాఫర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. 'మా ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ జరుగుతుంటే.. ఓ మూడో వ్యక్తి కెమెరా పట్టుకుని ఉన్నారు. ఆ కెమెరా ఎవరిదంటే బండ్ల గణేష్ అన్నది' అని వెల్లడించాడు. దీంతో బండ్ల 'దొంగలము అయితే ఇద్దరం అవ్వాలి. మంచోళ్లం అయినా ఇద్దరం అవ్వాలి' అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్, మెగా ఫ్యామిలీ ప్రశ్న
ఇక, ఈ ఇంటర్వ్యూ మొదలైన తర్వాత జర్నలిస్టు జాఫర్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను బండ్ల గణేష్ ముందుంచాడు. మరీ ముఖ్యంగా 'మీకు పవన్ కల్యాణ్ అంటే నిజంగా ఇష్టమేనా?'.. 'మెగా కాంపౌండ్ మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టింది?'.. 'మీ మాటలు గుండెల్లోంచే వస్తాయా' అంటూ సూటిగా ప్రశ్నించాడు. దీంతో బండ్ల గణేష్‌లో కోపం కట్టులు తెంచుకుంది.

జాఫర్‌పై బండ్ల సీరియస్
ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టు జాఫర్ అడిగిన వ్యక్తిగత ప్రశ్నలకు నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దీంతో 'నువ్వు ఇలా ప్రశ్నిస్తే.. నిన్ను ముడ్డి మీద తన్ని పంపిస్తారు. నువ్వు కృష్ణదేవరాయల్లా ఫీలై ఇంటర్వ్యూ చేస్తావు. పక్కవాడిని బానిసలా చూస్తావు. అసలు నీకు ఇంటర్వ్యూ చేయడం వచ్చా' అంటూ ఊహించని విధంగా కామెంట్లు చేశాడు.

నా సు... కోసుకుంటా అని
ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన బండ్ల గణేష్ 'నువ్వు కాలు మీద కాలేసుకుని లార్డ్ లఫంగిలాగ కూర్చుని, పక్క వాడు సార్ అనాలని అంటావు. ఆ తర్వాత సార్ తప్పైంతే గొంతు కోసుకుంటాం. సు** కోసుకుంటాం అని మాట్లాడతావేంటి సామీ నువ్వు' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ ప్రోమో వీడియోకు భారీ స్థాయిలో స్పందన దక్కి వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











