»   » తమ్ముడు కత్తి మహేష్ .... మాడి మసైపోతావు: బండ్ల గణేష్ వార్నింగ్

తమ్ముడు కత్తి మహేష్ .... మాడి మసైపోతావు: బండ్ల గణేష్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వద్ద అసలు డబ్బులే లేవని చెబెతూ పబ్లిక్ పంక్షన్లలో ఖర్చు పెట్టడానికి డబ్బెలా వస్తుందని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విమర్శిన సంగతి తెలిసిందే.

ఈ విషయం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్‌ను సినిమాల గురించి, అతడి యాక్టింగ్ గురించి, రాజకీయాల గురించి, అతడి అభిమానుల తీరుపై కత్తి మహేష్ చాలా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు భక్తుడుగా చెప్పుకునే బండ్ల గణేష్ స్పందించారు.

మాడి మసైపోతావు

కత్తి మహేష్ విమర్శలపై బండ్ల గణేష్ స్పందిస్తూ ‘తమ్ముడు కత్తి మహేష్ ....,సూర్యుడి వైపు చూడకు....,ఆ సూర్య కిరణాల మైన మా లాంటి వారిచే మాడి మసైపోతావు' అంటూ ట్వీట్ చేశారు.

పవర్ స్టార్‌కు ఆ అవసరం లేదు

పవర్ స్టార్‌కు ఆ అవసరం లేదు

నీతి...,నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవార్ స్టార్ కు రాదు....,లేదు అంటూ మరో అభిమాని చేసిన ట్వీట్‌ను బండ్ల గణేష్ రీట్వీట్ చేశారు.

అర్హతకు మించి

అర్హతకు మించి

సూర్యుడి గురించి, ఆయన శక్తి గురించి ఆలోచించే అంత బుర్ర లేదులే ..అందుకే అర్హతకి మించి మాట్లాడుతున్నాడు..... అంటూ పవన్ అభిమాని మహేష్ కత్తిని ఉద్దేశించి చేసిన ట్వీట్ ను బండ్ల గణేష్ రీట్వీట్ చేశారు.

మహేష్ కత్తి తీరుపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

మహేష్ కత్తి తీరుపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

మహేష్ కత్తి తన సినిమా రివ్యూల్లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలను విమర్శిస్తుండటంతో మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కొందరు అభిమానులు మహేష్ కత్తి పట్ల బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మీడియా ముందుకొచ్చిన మహేష్ కత్తి.... పవన్ కళ్యాణ్‌ అభిమానులను, వారిని కంట్రోల్ చేయలేకపోతేన్న పవన్ కళ్యాణ్‌ మీద విమర్శలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Pawan Kalyan fans are threatening Kathi Mahesh and they are countering on television also with cuss words on public platforms. Now, actor turned producer Bandla Ganesh has reacted strongly on Kathi Mahesh, by saying that Kathi Mahesh will turn into ash, through the ray like fans of sun like Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu