మెగాస్టార్‌కు ఈ అవార్డు ఎలా ఇస్తారండి?: చిరు అవార్డ్‌పై బండ్ల గణేష్ సీరియస్

మెగాస్టార్‌కు ఈ అవార్డు ఎలా ఇస్తారండి? మధ్యలో ఆగినా.. మరో పదేళ్లు తనకు తిరుగులేదన్న విషయాన్ని ఫ్రూవ్ చేసిన చిరంజీవికి అలాంటి అవార్డు ఇస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్

Recommended Video

మెగాస్టార్‌కు ఈ అవార్డు ఎలా ఇస్తారండి ? -బండ్ల గణేష్

అంశంపై ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక చర్చను పెట్టింది. దీనికి.. తెలుగు సినీ నిర్మాత నల్లమలుపు బుజ్జి.. సి. కల్యాణ్.. బండ్ల గణేశ్.. తదితరులు చర్చలో పాల్గొన్నారు. నంది అవార్డుల ఎంపికలో కమ్మ లాబీయింగ్ ప్రభావం చూపిందన్న భారీ ఆరోపణతో పాటు.. కావాలంటే జ్యూరీలో ఉన్న వారి పేర్లు ఏ సామాజిక వర్గానికి చెందిన వారో లెక్క చూడండంటూ బాహాటంగా చెప్పేయటం కనిపించింది.

జయలలిత బతికి ఉన్నప్పుడు

జయలలిత బతికి ఉన్నప్పుడు

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ చర్చలోకి అగ్రనటుడు కమల్ హాసన్ ప్రస్తావన వచ్చింది. జయలలిత బతికి ఉన్నప్పుడు నోరు ఎత్తని కమల్ హాసన్ ఆమె మరణించిన తర్వాత మాత్రం నీతులు చెబుతున్నారని.. మరి ఇదే నీతులు జయలలిత బతికి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ కొత్త పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

జయ మరణం తర్వాతే

జయ మరణం తర్వాతే

జయ మరణం తర్వాతే కమల్ కు తమిళనాడులోని సమస్యలు.. ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంతకు ముందు కనిపించలేదా? అంటూ కొత్త టాపిక్ ను తెర మీదకు తెచ్చేశారు. ఇక కమల్ ని పక్కన పెడితే బండ్ల గణేష్ చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం పై గణేష్ తప్పు పట్టాడు, అసలు చిరు రిటైర్ అయ్యాడు అనుకుంటున్నారా? ఈ అవార్దు ఏ ఉద్దెశం తో ఇచ్చారు? అంటూ ప్రశ్నించాడు...

రఘుపతి వెంకయ్య అవార్డు

రఘుపతి వెంకయ్య అవార్డు

"ఎన్టీఆర్ పురస్కారాన్ని రజనీకాంత్.. కమల్ హాసన్ కు ప్రకటించారు. బాగుంది. మరి.. చిరంజీవికి ఎందుకు ప్రకటించలేదు. సాధారణంగా రఘుపతి వెంకయ్య అవార్డుని రిటైర్ అయిన వాళ్లకు.. ఇండస్ట్రీలో వారి జర్నీ దాదాపుగా ముగిసిన వారికి ఇస్తుంటారు. సినిమాలకు చాలాకాలంగా దూరమైన కృష్ణంరాజుకు గతంలో ఇచ్చారు.

ఈ అవార్డు ఎలా ఇస్తారండి?

ఈ అవార్డు ఎలా ఇస్తారండి?

అదే రీతిలో ఈశ్వర్‌కు ఇచ్చారు. తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఖైదీ నెంబరు 150తో దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయిల కలెక్షన్ తో దూసుకెళ్లిన మెగాస్టార్‌కు ఈ అవార్డు ఎలా ఇస్తారండి? మధ్యలో ఆగినా.. మరో పదేళ్లు తనకు తిరుగులేదన్న విషయాన్ని ఫ్రూవ్ చేసిన చిరంజీవికి అలాంటి అవార్డు ఇస్తారా?

తొమ్మిదేళ్ల తర్వాత

తొమ్మిదేళ్ల తర్వాత

తొమ్మిదేళ్ల తర్వాత సినిమా చేసినా.. నెంబరు వన్ ప్లేస్ ను సొంతం చేసుకున్న చిరంజీవి తాజా చిత్రం సైరా సుమారు రూ.400 కోట్లు పెట్టి తీస్తున్నారు. మరి.. ఆ సినిమా హక్కుల కోసం రోజు చిరంజీవి ఇంటికి వెళుతున్నారు. ఆయన డేట్స్ కోసం ఎంతో మంది నిర్మాతలు ఆయన ఇంటికి వెళుతున్నారు.

 రఘుపతి వెంకయ్య అవార్డు

రఘుపతి వెంకయ్య అవార్డు

అలాంటి వ్యక్తికి.. రిటైర్ అయినోళ్లకు ఇచ్చే రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించటమా? అంటే.. చిరంజీవిని రిటైర్ కావాలని కోరుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం కానీ.. నంది అవార్డుల జ్యూరీ కానీ చిరు రిటైర్మెంట్ను కోరుకుంటున్నారా? తనకు అలాంటి అవార్డులు ఇవ్వాలని చిరు ఎప్పుడైనా అడిగారా" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బండ్ల గణేశ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X