Vakeel Saab.. హరీష్ శంకర్ అలా అనిల్ రావిపూడి ఇలా.. మాస్ కా బాప్ అంటోన్న బండ్లన్న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అభిమానులు, సెలెబ్రిటీలు సైతం వకీల్ సాబ్ కోసం ఊగిపోతోన్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీల్లొ హార్డ్ కోర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విశ్వరూపం గురించి ట్వీట్లు పెడుతున్నారు. అందరి కంటే ఎక్కువగా బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ట్రెండింగ్‌లో బండ్లన్న..
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన స్పీచ్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. లఫూట్ అంటూ చెప్పిన స్పీచ్, పవన్ కళ్యాణ్‌కి ఉన్న పొగరు గురించి చెప్పిన మాటలు, పోల్చిన తీరు అదిరిపోయింది. అలా తాజాగా వకీల్ సాబ్ గురించి బండ్లన్న వేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

మాస్ కా బాప్..
మాస్ కా బాస్ వకీల్ సాబ్.. మాటల్లేవ్.. వాదనల్లేవ్.. కేవలం తీర్పు మాత్రమే.. అది కూడా బ్లాక్ బస్టర్.. జై పవర్ స్టార్ అంటూ ట్వీట్ వేశాడు. తమన్ నువ్ వకీల్ సాబ్ కోసం ప్రాణం పెట్టి చేశావ్.. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు.

హరీష్ శంకర్ అలా..
ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ శంకర్ వకీల్ సాబ్ గురించి కామెంట్ చేశాడు. అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఒకే ఒక్క పదంతో వకీల్ సాబ్ గురించి చెప్పేశాడు. జాతర షురూ అంటూ వకీల్ సాబ్ గురించి కామెంట్ చేశాడు.
Recommended Video

అనిల్ రావిపూడి ఇలా..
వకీల్ సాబ్ జడ్జ్ మెంట్.. పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్.. పవన్ కళ్యాణ్ సర్ వన్ మెన్ షో.. కథ, కథనం, దర్శకత్వంలో వేణు శ్రీ రామ్ సూపర్.. తమన్ ఇరగ్గొట్టేశాడు.. అంటూ ఇలా ప్రతీ ఒక్కరి గురించి అనిల్ రావిపూడి కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications










