దారిలో ప్రమాదం, గాయపడిన వారికి సాయం.. బండ్లన్న పెద్ద మనసు
టాలీవుడ్‌లో చిన్న పాత్రలను చేస్తూ కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. గబ్బర్ సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోయాడు. బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్ మధ్యలో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. అవి అచ్చిరాక మళ్లీ సినిమాలపై శ్రద్ద పెట్టాడు. చివరగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
బండ్ల గణేష్‌కు కరోనా వైరస్ సోకడం అందర్నీ కలవర పరిచింది. అయితే తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవడంతో బండ్ల గణేష్ కరోనాను జయించాడు. కరోనా నుంచి కోలుకున్న తరువాత బండ్ల గణేష్‌లో చాలా మార్పు వచ్చింది. మునుపటిలా కాంట్రవర్సీల జోలికి వెళ్లడం లేదు. ఇకపై అలాంటి కామెంట్లు కూడా చేయదలుచుకోవడం లేదట.. ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాని మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. తాజాగా బండ్ల గణేష్ తన పెద్ద మనసును చాటుకున్నాడు.

పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేలో షాద్ నగర్ నుంచి ప్రయాణిస్తున్నాడట. ఆ సమయంలో ఓ వ్యక్తికి బైక్ యాక్సిడెంట్ అయిందని తెలిపాడు. ఈ మేరకు బండ్ల గణేష్ వీడియోలు షేర్ చేశాడు. అందులో బండ్లన్న సదరు వ్యక్తిని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. డబ్బులు ఉన్నాయా?, దెబ్బలు తగిలియా? హాస్పిటల్‌కు వెళ్దామా? అని అడిగాడు.

అంతేకాకుండా కాలికి దెబ్బ తగలడంతో తన వద్ద ఉన్న బాటిల్‌తో ఆ గాయంపై స్వయంగా నీళ్లు పోశాడు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని బండ్ల గణేష్ తెలిపాడు. బండ్లన్న చేసిన ఈ చిన్ని సాయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తుండగా.. అసలు ఆ ఫ్లై ఓవర్ మీద టూ వీలర్స్‌కు అనుమతి లేదని, పోలీసులకు ఫోన్ చేయాలని బండ్ల గణేష్‌కు సలహాలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











