మెగాస్టార్ వీడియో పోస్ట్ చేసిన బండ్ల.. నోట మాట రావడం లేదు అంటూ కామెంట్స్!

బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు ఆయన. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీడియో షేర్ చేసిన బండ్ల గణేష్ దానికి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో

డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో

తాజాగా హైదరాబాద్‌ లోని లాల్‌ బంగ్లాలో యోధ లై ఫ్‌లైన్‌ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు యోధ లైఫ్‌లైన్‌ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకులు సుధాకర్ రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నిజంగా ఇది తాను ఊహించలేదనీ అన్నారు.

చిరంజీవి కీలక వ్యాఖ్యలు

చిరంజీవి కీలక వ్యాఖ్యలు

ఎన్నో సంవత్సరాలుగా నా సొంత ఖర్చులతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను నేను నడిపానన్న చిరంజీవి ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దలు సాయం చేయడానికి ముందుకొచ్చారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను నేను నడిపే విధానంలో నా చిత్తశుద్ధిని చూసి ఇంప్రెస్ అయి సాయం చేస్తున్నారు. అందులో భాగంగా మీరు కూడా సాయం చేస్తున్న సాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానాని అన్నారు. అలా మీరిచ్చే ప్రతి పైసా అవసరార్థులకు చేరుందనే భరోసా నేను మీకు కల్పిస్తున్నానన్న మెగాస్టార్ ఇదే సమయంలో ఇంకో చిన్న విన్నపం చేస్తున్నామని అంటూ ఒక కోరిక కోరారు.

ఇండస్ట్రీ వారికి శుభవార్త

ఇండస్ట్రీ వారికి శుభవార్త

మా ఇండస్ట్రీలో ఇక్కడ 24 క్రాఫ్ట్స్‌లో ఎంతో మంది పేద కళాకారులున్నారను వారికి సరైన వైద్యం అందక వాళ్లు బాధపడుతున్నారుని అన్నారు. అలాంటి వారికి ఈ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ద్వారా మీరు ఒక వెసులు బాటు ఇవ్వగలిగితే ఎంతో సంతోషం అని కొరారుం మీరు మనస్ఫూర్తిగా ఇస్తే ఎంతో రుణపడి ఉంటాం అని పేర్కొనగా మెగాస్టార్ విన్నపాన్ని విన్న సుధాకర్ వెంటనే స్పందిస్తూ సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాల వారికి 50 శాతం డిస్కౌంట్‌తో సేవలు అందిస్తామని ఎక్కడికక్కడే హామీ ఇచ్చారు.

 వెంకయ్య రాష్ట్రపతి కావాలి

వెంకయ్య రాష్ట్రపతి కావాలి

ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశిస్తూ ఆయన త్వరలోనే రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇక బండ్ల గణేష్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ . ''మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితలేదు.

Recommended Video

Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగతా సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండడంతో ఇప్పటికి ఈ కథ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక మరో పక్క బండ్ల గణేష్ హీరోగా డేగల బాబ్జి సినిమా రూపొందుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం మీద బండ్ల గణేష్ పాత్ర ఒక్కటే కనిపిస్తూ ఉండగా కొన్ని పాత్రలకు సంబంధించిన వాయిస్ వినపడుతోంది. ఈ సినిమా మీద ఆయన చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X