అల్లు అర్జున్..'బాద్‌షా' మీద కాన్సర్టేట్ చెయ్యమన్నాడు
అలాగే స్పెయిన్‌లో ఇద్దరమ్మాయిలతో షూటింగ్‌లో ఉండగా తన పనులన్నీ అర్జునే చూసుకొని బాద్‌షా చిత్రం విడుదల చేసి బ్లాక్‌బస్టర్ కొట్టండి అని 'ఆల్‌ది బెస్ట్' చెప్పి పంపించాడని బండ్ల గణేశ్ చెప్పారు. అర్జున్‌కు ఈ చిత్రం నెంబర్ వన్ చిత్రంగా నిలుస్తుందని, మళ్లీమళ్లీ బన్నీతో సినిమాలు చేసే అవకాశం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
బాంకాక్‌లో ఇంటర్నేషనల్ ఫైట్‌మాస్టర్ కిచ్చా డిజైన్ చేసిన యాక్షన్ పార్ట్ అద్భుతంగా వచ్చిందని, స్పెయిన్‌లో చిత్రీకరించిన పాట హైలెట్‌గా నిలుస్తుందని, దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన
వివరించారు. టోటల్‌గా ఈ చిత్రం క్వాలిటీ ఎంత గ్రాండ్‌గా వుంటుందో విడుదలయ్యాక ప్రేక్షకులే చూస్తారని నిర్మాత అన్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తారు. గణేష్ మాట్లాడుతూ ''ఇద్దరమ్మాయిలతో కలిసి బన్నీ పంచే వినోదాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తాయి. ఆయన్ని 'దేశముదురు' తర్వాత ఓ కొత్తకోణంలో చూపించారు దర్శకుడు పూరిజగన్నాథ్. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన స్వరాలు చాలా బాగున్నాయి. పూరి జగన్నాథ్‌తో తొలిసారి జతకట్టిన ఆయన హుషారైన బాణీలు అందించారు అన్నారు.
తమ సంస్థ అందించిన గబ్బర్‌సింగ్, బాద్‌షా చిత్రాల స్థాయిలోనే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం బాద్‌షా బ్లాక్‌బస్టర్ హిట్టయిన ఆనందంలో ఉండగానే అల్లు అర్జున్ పుట్టినరోజు రావడం మరింత సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. బ్రహ్మానందం, నాజర్, షవర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అమోల్‌రాథోడ్, కళ: బ్రహ్మ కడలి, సమర్పణ: శివబాబు బండ్ల.


Click it and Unblock the Notifications












