twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి నటుడిగా బండ్ల గణేష్.. ఈసారి అంతకుమించి.. ఏకంగా హీరోగా..

    |

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తరువాత బండ్ల గణేష్ నిర్మాతగా కూడా క్లిక్కయిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫెయిల్యూర్స్ బ్యాలెన్స్ చేస్తూ నిర్మాతగా కొనసాగిన గణేష్, పవన్ అభిమానిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గణేష్ ఇచ్చిన స్పీచ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే త్వరలోనే బండ్ల గణేష్ ఒక కథలో టైటిల్ రోల్ లో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    కరోనా సమయంలో క్లినిక్‌లోకి కరీనా.. కెమెరా కంటికి చిక్కిన బ్యూటీ

    సొంతంగా వ్యాపారులు

    సొంతంగా వ్యాపారులు

    చిన్న నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన బండ్ల గణేష్ కొన్నాళ్లకు సొంతంగా వ్యాపారులు పెట్టుకొని మంచి లాభాలను అందుకున్నాడు. ఓ వైపు బిజినెస్ చేస్తూనే నటుడిగా చిన్న తరహా పాత్రలు చేసిన బండ్ల గణేష్ ఒక స్థాయి వచ్చిన అనంతరం యాక్టింగ్ ను పక్కన పెట్టేశాడు.

    ఎప్పుడైతే గబ్బర్ సింగ్ తో హిట్టు పడిందో..

    ఎప్పుడైతే గబ్బర్ సింగ్ తో హిట్టు పడిందో..

    ఇక బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ లో మొదట ఆంజనేయులు అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక ఆ తరువాత తీన్ మార్ సినిమాతో దారుణంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఎప్పుడైతే గబ్బర్ సింగ్ తో హిట్టు పడిందో అప్పటి నుంచి బండ్ల గణేష్ జీవితమే మారిపోయింది.

    టెంపర్ చివరి సినిమా

    టెంపర్ చివరి సినిమా

    ఇక ఆ తరువాత విభిన్నంగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన బండ్ల గణేష్ చివరగా జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా తరువాత ఎందుకో మళ్ళీ బండ్ల గణేష్ నిర్మాతగా సినిమా చేయలేదు. ఆ మధ్య ఏదో కొత్త సినిమా స్టార్ట్ చేసినట్లు టాక్ వచ్చింది కానీ వర్కౌట్ కాలేదు.

    బ్లేడ్ గణేష్ పాత్రతో..

    బ్లేడ్ గణేష్ పాత్రతో..

    ఇక నటుడిగా మాత్రం బండ్ల గణేష్ నటుడిగా నటించిన చివరి సినిమా సరిలేరు నీకెవ్వరు. అందులో తన రీయల్ లైఫ్ లో ట్రోలింగ్ కు గురి చేసిన బ్లేడ్ గణేష్ పాత్రతోనే కనిపించాడు. ఆ పాత్ర బాగానే క్లిక్కయినప్పటికి గణేష్ కు పర్సనల్ గా నచ్చలేదు. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత నటుడిగా సరికొత్త రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

    హీరోగా మరొక కొత్త సినిమా..

    హీరోగా మరొక కొత్త సినిమా..

    తమిళ్ లో హిట్టయిన 'మండేలా' అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారాట. బండ్ల గణేష్ ఇప్పటికే రీమేక్ రైట్స్ పై చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. తమిళ్ లో యోగిబాబు నటించిన ఆ సినిమా బండ్ల గణేష్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని ఓ దర్శకుడు ఇచ్చిన సలహా మేరకు బండ్ల గణేష్ సొంత బ్యానర్ లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.

    English summary
    Tollywood superstar Mahesh Babu may not be able to turn his eyes on the audience. He's 44 years old. He is capable of maintaining glamor regardless of age. Mahesh Babu who became the girl's dream boy with glamor gave another shock with another photo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X