twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నంది అవార్డుల ప్రకటన ఓ కామెడీ షో.. అవి సైకిల్ అవార్డులు.. బండ్ల గణేష్

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    By Rajababu
    |

    Recommended Video

    నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులు..!

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవార్డులపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో తీవ్రంగా స్పందించారు. నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరుగుతున్నది అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా తాను రూపొందించిన గోవిందుడు అందరివాడేలే చిత్రానికి అవార్డు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ వెల్లడించిన అభిప్రాయం ఆయన మాటల్లోనే..

     అవార్డులు ఓ కామెడీ షో

    అవార్డులు ఓ కామెడీ షో

    నంది అవార్డుల ప్రకటన చూస్తే మెగా ఫ్యామిలీని పట్టించుకోలేదు అని స్పష్టమైంది. ఒకరోజు కామెడీ షోగా అనిపించింది. ఇంట్లో కూర్చొని ఇంట్లో తమ్ముళ్లకు, బంధువులకు ఇచ్చినట్టు అర్థమవుతుంది. మెగా ఫ్యామిలీని పరిగణనలో

     బాలకృష్ణ జ్యూరీ సభ్యుడు

    బాలకృష్ణ జ్యూరీ సభ్యుడు

    బాలకృష్ణ జ్యూరీ సభ్యుడిగా ఉన్నారు. అవార్డులను ప్రకటించి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి కలిశాడు. ఓ కమిటీలో ఉండి ఉత్తమ నటుడి అవార్డును ఎలా తీసుకొంటారు. మెగా ఫ్యామిలీ అవార్డులు రాకపోవడం చాలా బాధగా ఉంది.

     నందమూరి ఫ్యామిలీకి అవార్డుల రావాలి

    నందమూరి ఫ్యామిలీకి అవార్డుల రావాలి

    నందమూరి ఫ్యామిలీకి రావడంపై నాకు ఎలాంటి బాధలేదు. మెగా ఫ్యామిలీకి రాకపోవడం నాకు ఆందోళన కలిగిస్తున్నది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన మనం లాంటి చిత్రానికి అవార్డు ఇవ్వకుండా లెజెండ్ లాంటి చిత్రానికి ఎలా అవార్డు ఇస్తారు. నందమూరి ఫ్యామిలికి అవార్డులు రావాలి. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి అవార్డుల దక్కాలి.

     లెజెండ్‌కు కాదు.. గోవిందుడికి రావాలి

    లెజెండ్‌కు కాదు.. గోవిందుడికి రావాలి

    లెజెండ్ చిత్రం బ్లాక్ బస్టర్ కావొచ్చు. గోవిందుడు అందరివాడేలే చిత్రం యావరేజ్ హిట్ కావొచ్చు. కానీ కుటుంబ కథా చిత్రంలో రాంచరణ్ అద్భుతంగా నటించాడు. ఆయనకు అవార్డు వస్తుందని అనుకొన్నాను. రాకపోవడంపై నిరాశ చెందాను.

     జ్యూరీ కమిటీ కేవలం ఆటబొమ్మలు

    జ్యూరీ కమిటీ కేవలం ఆటబొమ్మలు

    జ్యూరీ సభ్యులందరూ ప్రభుత్వం చేతిలో కేవలం ఆటబొమ్మలు మాత్రమే. నంది అవార్డులు కాదు.. అవి సైకిల్ అవార్డులు. నంది అవార్డులకు సైకిల్ అవార్డులు అని పేరు పెడితే బాగుంటుంది.

     అప్పుడు.. ఇప్పుడు అన్యాయమే..

    అప్పుడు.. ఇప్పుడు అన్యాయమే..

    చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వడం కంటితుడుపు చర్య. గతంలో మగధీర చిత్రానికి, అందులో నటించిన రాంచరణ్‌కు అవార్డులు ఇవ్వకుండా అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా అన్యాయమే జరుగుతున్నది అని బండ్ల గణేష్ అన్నారు.

    English summary
    Producer Bandla Ganesh made serious allegation over Nandi Awards annoncement. He said AP government made Nandi awards as Cycle awards. Those awards treated as cycle awards. Bandla Ganesh criticises that lot injustice happening to Mega Family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X