రూ. 100 కోట్లతో పవన్ కళ్యాణ్‌తో సినిమా.... క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్!

'జనసేన' పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడుగా ఉండి కూడా పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఓడిపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వస్తారనే ప్రచారం ఊపందుకుంది.

వాస్తవానికి ఎన్నికల ముందు నుంచే పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తనకు నటించే ఉద్దేశ్యం లేదని, పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగనున్నట్లు కొన్ని రోజుల క్రితమే పవన్ స్పష్టం చేశారు. అయితే మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈ గాసిప్స్ గుప్పుమన్నాయి.

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో బండ్ల గణేష్ మూవీ

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో బండ్ల గణేష్ మూవీ

ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం నిర్మించే బాధ్యతలు ఆయన భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ తీసుకోబోతున్నారని, గణేష్ తన సొంత బేనర్లో రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బోయపాటి శ్రీను తెరపైకి

బోయపాటి శ్రీను తెరపైకి

బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయబోతున్నట్లు రూమర్స్ హల్ చల్ చేశాయి. ఈ వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అయోమయానికి దారి తీసింది. నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఈ వార్తలపై బండ్ల గణేష్ బుధవారం క్లారిటీ ఇచ్చారు. ‘మా నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. మా సంస్థ నుంచి ఏదైనా సినిమా వస్తే అందరి కన్నా ముందుగా నేనే ప్రకటిస్తాను' అని ట్వీట్‌ చేశారు. గణేష్ వివరణ ఇవ్వడంతో పవర్ స్టార్ మూవీ విషయంలో నెలకొన్ని ఊహాగానాలకు తెరపడినట్లయింది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

వపన్ కళ్యాణ్ చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' చిత్రంలో నటించారు. 2018 జనవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది. దీని తర్వాత సినిమాలను వదిలేసిన పవర్ స్టార్ జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లి 2019 ఎన్నికల్లో విఫలం అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X