»   » ఇన్నాళ్లు ఏమయ్యాడో?...మళ్లీ తెరపైకి నిర్మాత బండ్ల గణేష్!

ఇన్నాళ్లు ఏమయ్యాడో?...మళ్లీ తెరపైకి నిర్మాత బండ్ల గణేష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదనుకుంటా. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్.... ఉన్నటుండి బడా సినిమాల నిర్మాతగా మారి అప్పట్లో అందరికీ షాకిచ్చారు. బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసి మెగా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.

ఉన్నట్టుండి కొంత కాలంగా బండ్ల గణేష్ తెరమరుగు అయ్యారు. కనీసం సినిమా పంక్షన్లలో కూడా కనిపించడం మానేసారు. ఎట్టకేలకు బండ్ల గణేష్ మళ్లీ తెరపైకి వచ్చారు. త్వరలో తెలుగులో డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

షాక్: బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ ఇలా అయ్యారేంటి? (ఫోటో)

Bandla Ganesh next film 'Two Countries'

మలయాళంలో దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన టూ కంట్రీస్ చిత్రం సూపర్ డూపర్ హిట్టై 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. టూ కంట్రీస్ చిత్ర తెలుగు హక్కుల్ని విపరీతమైన పోటీ నడుమ దక్కించుకున్నారు.

ఇప్పటివరకు ఏ మలయాళ చిత్రానికి కూడా ఇవ్వనంత ఎక్కువ ధరకు టు కంట్రీస్ చిత్ర హక్కుల్ని పొందారు. బడా నిర్మాతలు ఈ చిత్రం కోసం పోటీ పడ్డారు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే... పలువురు టాప్ స్టార్స్ ఈ చిత్రంలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'మలయాళ బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ చిత్ర హక్కుల్ని భారీ పోటీ మధ్య దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం. అందుకే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి తెలియజేస్తాను'. అని అన్నారు.

English summary
The rights of Malayalam Romantic comedy film Two Countries, Directed by Shafi, Starring Dileep, Mamta Mohandas, Aju Varghese, Isha Talwar, Mukesh, Jagadish, Lena, Srinda , has been bagged by Blockbuster Producer Bandla Ganesh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu