అదే పనిలో ఉన్న బ్రదర్.. మన దేవుడు కరుణించాలి కదా.. పవన్‌తో బండ్లన్న సినిమా!!
బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. దానంలో కర్ణుడిగా మారిపోయాడు బండ్ల గణేష్. ఎవరు ఏ సాయం అడిగినా వెంటనే చేసేస్తున్నాడు. డబ్బులు అడిగిన వారికి ఎంతో కొంత ముట్టజెప్పుతున్నాడు.. ఉద్యోగం అడిగిన వారికి ఎక్కడో చోట ఏర్పాటు చేస్తున్నాడు. కరోనాను జయించిన తరువాత బండ్ల గణేష్ ఎంతో మారిపోయాడు. ఈ మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాంట్రవర్సీలకు కేరాఫ్..
ఒకప్పుడు బండ్ల గణేష్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వాడు. ప్రతీ చిన్న విషయాన్ని అంతెత్తున లేచేవాడు. నువ్వెంత అంటే నువ్వెంత అనే మనస్తత్వంతో ఉండేవాడు. అందుకే పీవీపీ, హరీష్ శంకర్ విషయాలు అంతగా రచ్చకెక్కాయి. అయితే కరోనాతో పోరాడి గెలిచిన తరువాత పూర్తిగా మారిపోయాడు.

కొత్త బండ్ల గణేష్..
కరోనాను జయించిన తరువాత బండ్ల గణేష్ కూల్‌గా మారిపోయాడు. ఎక్కడా ఆవేశ పడటం లేదు. వీలైనంత శాంతంగా ఉంటున్నాడు. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటున్నాడు. అందరూ ఒక్కటే, ఎవరికి ఉండేది వారికి ఉంటుంది.. అయినా బతికినన్ని రోజులు చక్కగా బతికితే చాలు అంటూ వేదాంతం మాట్లాడుతున్నాడు.

సాయంలో ముందు..
దేశ వ్యాప్తంగా సోనూసూద్ ఏవిధంగా సాయం చేస్తున్నాడో.. రాష్ట్ర స్థాయిలో తనకు చేతనైన సాయాన్ని బండ్ల గణేష్ చేస్తున్నాడు. ఎందరికో డబ్బులు పంపిస్తున్నాడు. అర్హత ఉన్నవారికి సాయం చేస్తూ ఉద్యోగాలిప్పిస్తున్నాడు. ఇక నెటిజన్లు చేసే కామెంట్లకు ఎంతో కూల్‌గా సమాధానం ఇస్తున్నాడు.
Recommended Video

దేవుడి ఆశీర్వాదం..
మా అన్న పవన్ అన్నగారితో సినిమా ఎప్పుడు తీస్తున్నారు అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ రిప్లై ఇచ్చాడు. నేను అదే పనిలో ఉన్నాను బ్రదర్.. మన దేవుడి ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ బండ్ల గణేష్ చిన్న హింట్ ఇచ్చాడు. మొత్తానికి సినిమా తీసే ప్రయత్నాల్లోనే ఉన్నానని తెలిపాడు.


Click it and Unblock the Notifications











