బాస్ ఒకే అన్నాడు.. మరోసారి నా డ్రీమ్ నెరవేరింది.. బండ్ల గణేష్‌కు గ్రీన్ సిగ్నలిచ్చిన పవన్ కల్యాణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కి ఉండే క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిర్మాత, డైరెక్టర్, హీరో కాంబినేషన్స్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక త్వరలో గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో ఒక పవర్ఫుల్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అఫీషియల్ గా ట్విట్టర్ లో ఒక ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వడంతో ఫైనల్ గా పవన్ 30వ ప్రాజెక్టుపై కూడా అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.

పవన్ కళ్యాణ్ కరుణిస్తే..

పవన్ కళ్యాణ్ కరుణిస్తే..

గతంలో చాలా సార్లు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కరుణిస్తే నిమిషాల్లో ప్రాజెక్టు సెట్టయిపోతుందని చెప్పాడు. పవర్ స్టార్ అభిమానులు కూడా రెగ్యులర్ గా ఈ గబ్బర్ సింగ్ నిర్మాతను ఆ విషయంపై వివరణ కోరుతున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ లో చురుగ్గా ఉంటున్న బండ్ల గణేష్ అప్పుడప్పుడు పవన్ తో ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని హింట్ ఇస్తూ వచ్చాడు. కొన్ని మీడియాలలో వీరి కాంబినేషన్స్ పై రూమర్స్ కూడా వచ్చాయి.

ఫొటోతో గుడ్ న్యూస్ చెప్పిన బండ్ల గణేష్

ఫొటోతో గుడ్ న్యూస్ చెప్పిన బండ్ల గణేష్

ఇక ఇటీవల మొత్తానికి మా బాస్ ఒకే చెప్పాడని, నా డ్రీమ్ మళ్ళీ నిజం కాబోతున్నట్టుకు చెబుతూ.. దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ తో చాలా రోజుల తరువాత కలుసుకున్న ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్ అభిమానులకు ఒక మంచి కిక్కిచ్చినట్లు అర్ధమవుతోంది. కేవలం ఆయన ఒకే చేశారని మాత్రమే చెప్పిన గణేష్ మిగతా విషయాలు ఏమి చెప్పలేదు.

5 ఏళ్ళ గ్యాప్ తరువాత..

5 ఏళ్ళ గ్యాప్ తరువాత..

మొదట పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత హారిష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్నాడు. ఇక ఆ తరువాత టెంపర్ వరకు బాగానే సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఎందుకో 5 ఏళ్ళ గ్యాప్ ఇచ్చాడు. ఇక మంచి సినిమాతోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్ప ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Recommended Video

Bandla Ganesh Sketch To Enter Into Janasena Party
హిట్టివాల్సిన బాధ్యత ఉంది.. దర్శకుడు అతనేనా?

హిట్టివాల్సిన బాధ్యత ఉంది.. దర్శకుడు అతనేనా?

దర్శకుడు ఎవరనే విషయంలో బండ్ల గణేష్ కొంచెం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే పవన్ వకీల్ సాబ్ తో పాటు, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక 30వ సినిమా కూడా ఫిక్స్ అవుతున్నట్లు టాక్ వస్తున్న తరుణంలో బండ్ల గణేష్ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా ఉంటుందని ఆ మధ్య ఈ నిర్మాత ఒక వివరణ ఇచ్చారు. ఇక అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ పవన్ కి హిట్టివాల్సిన బాధ్యత చాలానే ఉంది. బహుశా ఈ కాంబినేషన్ లో సెట్టవుతుందేమో అనే అనుమానం కలుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X