twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పటికీ పవన్ నా దేవుడే.. ప్రతీసారి కోసుకొని చెప్పాలా? ఆ హీరోకు మోసం చేయలేదు.. బండ్ల గణేష్

    |

    నిర్మాత బండ్ల గణేష్ ఏ మాట్లాడినా.. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతాడు. ఎదుట ఎవరున్నారనే విషయాన్ని అసలే పట్టించకోడు. తప్పైనా.. ఒప్పైనా తాను చెప్పాల్సిందేదో చెప్పడంలో వెనుకాడడు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ తన ఆరాధ్యదైవం పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే పూరి జగన్నాథ్, ఎన్టీఆర్, రవితేజ, సచిన్ జోషితో ఉన్న విభేదాల గురించి చక్కగా క్లారిటీ ఇచ్చారు. బండ్ల గణేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    బండ్ల గణేష్ ఓ బ్రాండ్

    బండ్ల గణేష్ ఓ బ్రాండ్

    సినీ పరిశ్రమలోనే కాదు.. రాజకీయాల్లోనూ బండ్ల గణేష్ ఓ బ్రాండ్. టాలీవుడ్‌లో సినిమాలు తీసి గెలిచా.. రాజకీయాల్లో కూడా రాణిస్తా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీట్ ఇచ్చినా గెలిచి చూపిస్తా. ప్రేక్షకులను మెప్పించినట్టే.. సమాజంలో ఓటర్లను కూడా ఆకట్టుకొంటాను.

     సినీ నిర్మాణం నా వ్యాపారం

    సినీ నిర్మాణం నా వ్యాపారం

    రాజకీయాల్లోకి రావడానికి సినిమాలకు దూరం కావడం లేదు. సినిమా అనేది నా వృత్తి. సినిమా పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటా. నా సంపాదన సినిమా నుంచి ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్లి సేవ చేస్తా. సినిమాలు రూ.70, రూ.80 కోట్లతో కూడా సినిమాలు చేశాను.

    పవన్ దయతోనే నిర్మాతనయ్యా

    పవన్ దయతోనే నిర్మాతనయ్యా

    ఎంపీగా ఉన్నప్పటి నుంచే బొత్స సత్యనారాయణతో మంచి అనుబంధం ఉంది. అందుకే నన్ను బినామీ అంటారు. కేవలం పవన్ కల్యాణ్ దయతోనే నేను నిర్మాతనయ్యాను. పవన్ కల్యాణ్ భిక్షతోనే ఇలా ఉన్నాను. పవన్ కల్యాణ్ నిర్మాతను చేస్తానని చెప్పి నన్ను నిర్మాతను చేశారు.

    పూరీ జగన్నాథ్‌తో గొడవ ముగిసింది

    పూరీ జగన్నాథ్‌తో గొడవ ముగిసింది

    పూరి జగన్నాథ్‌కు రూ.40 లక్షలు పెట్టి లైటర్ కొనిచ్చాను. కానీ దానికి అయ్యింది కేవలం రూ.10 లక్షలు మాత్రమే. అందులో తప్పేమీ లేదు. ఇన్‌కం టాక్స్ వాళ్లు పన్ను కట్టమని చెప్పారు. నేను పన్ను కట్టేశాను. దాంతో ఆ గొడవ ముగిసిపోయింది.

    పవన్ కల్యాణ్ నా దేవుడు

    పవన్ కల్యాణ్ నా దేవుడు

    పవన్ కల్యాణ్ నాకు దేవుడు. ఆ భావన ఎప్పుడూ మారదు. నా బాస్ గురించి ప్రతిసారీ కోసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ చేరినా పవన్ కల్యాణ్ పట్ల ఉండే ఆరాధ్యభావం ఎప్పటికీ మారదు.

    ఆ హీరోల నుంచి వ్యతిరేకత రాదు

    ఆ హీరోల నుంచి వ్యతిరేకత రాదు

    నాకు హీరో సచిన్, ఎన్టీఆర్, రవితేజతో అభిప్రాయాలు బేధాలు తొలిగిపోయాయి. వాళ్లతో విభేదాల వల్ల వారి ఫ్యాన్స్ నుంచి నాకు వ్యతిరేకత రాదు. సినిమా వాళ్లు మంచి వాళ్లు. వారి నుంచి నా పట్ల వ్యతిరేకత రాదు అని బండ్ల గణేష్ అన్నారు.

    English summary
    Film Producer, Politician Bandla Ganesh comments about Pawan Kalyan. He reirritated that Pawan is my god. With his blessings, I become producer. Recently, Bandla Ganesh joined in Congress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X