మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. నా దేవుడు ఆయనేరా.. లుచ్చా.. లోఫర్ అంటూ బండ్ల గణేష్ వీరంగం!

ఏ వేదికైనా సరే.. నిర్మాత బండ్ల గణేష్ చేతిలో మైక్ ఉంటే వాటి గుండా వచ్చే మాటలు తూటల్లా పేలుతుంటాయి. అదే పవన్ కల్యాణ్ ఫంక్షన్ అయి.. పవర్ స్టార్ ఎదురుగా ఉంటే ఇక ఆ మాటల పదును గురించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సంఘటనే పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో సాక్ష్యంగా నిలిచింది. ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ...

పవన్ కల్యాణ్ సినిమాల గురించి

పవన్ కల్యాణ్ సినిమాల గురించి

వకీల్ సాబ్ గురించి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందటే.. ఐపీఎస్ పాస్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి మీరు 10 క్లాస్ బాగా రాశారు అంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడితే అలా ఉంటుంది అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో అన్నారు.

పవన్ కల్యాణ్‌కు పొగరు అంటూ ...

పవన్ కల్యాణ్‌కు పొగరు అంటూ ...

పవన్ కల్యాణ్ ఎయిర్‌‌పోర్టులో పొగరుగా నడుస్తూ వెళ్లున్నాడు అంటే నాకు బాగా కోపం వచ్చింది. అవును ఆయనకు పొగరే.. కానీ ఎలాంటి పొగరు అంటే... పాకిస్థాన్ సైన్యానికి పట్టుబడ్డ వింగ్ కమాండర్ అభినందన్ మీసం కట్టుకు ఉన్న పొగరు ఆయనకు ఉన్నది.. చైనా సరిహద్దులలో ట్రిగ్గర్ నొక్కడానికి సిద్దంగా ఉన్న సైనికుడికి ఉన్న పొగరు ఉంది.. అంటూ బండ్ల గణేష్ ఆవేశంతో ఊగిపోయారు.

శివాజీ ఖడ్గానికి ఉన్నంత పొగరు

శివాజీ ఖడ్గానికి ఉన్నంత పొగరు


మరాటా యోధుడు చత్రపతి శివాజీ ఖడ్డానికి ఉన్న పొగరు ఉందని, ఎర్రకోటపై ఎగిరే మువ్వెన్నెల జెండాకు ఉన్న పొగరు.. రాజ్యంగాన్ని రాసిన అంబేద్కర్ రాసిన మాటలకు ఉన్న పొగరు.. లంక సైన్యంపై సంధించిన శ్రీరాముడి బాణానికి ఉన్న పొగరు.. నునూగు మీసాలు వయసులో ఉరికంబాన్ని ఎక్కి ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్‌కు ఉన్నపొగరు ఉంది అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హంగామా... ఆకట్టుకొన్న డ్రమ్మర్ శివమణి

కేబీఆర్ పార్కులో వెంటాడి..

కేబీఆర్ పార్కులో వెంటాడి..

కేబీఆర్ పార్కులో పవన్ కల్యాణ్ గురించి చెబుతూ ఉంటే ఆ వ్యక్తి పారిపోతుంటే.. మళ్లీ పట్టుకొని
అందరి కంటే దిక్కులు పిక్కటిల్లేలా పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ కొట్టుకొనే పవన్ కల్యాణ్ అభిమాని గుండెకు ఉన్న పొగరు ఉంది. పవన్ కల్యాణ్ నా దేవుడు.. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. నా దేవుడు ఎవరో నాకంటే మీకే తెలుసు అని బండ్ల గణేష్ భావోద్వేగంగా ప్రసంగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X