ఆరు నూరైనా అతడే తెలంగాణ సీఎం.. డిసెంబర్ 9న ప్రమాణం.. బండ్ల గణేష్ జోస్యం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. తమ పార్టీల గెలుపుపై నేతలు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిందనే విషయంపై నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం తథ్యం అని ఆయన జోస్యం చెప్పారు. మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడుతూ..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. మీడియాలో కనిపించకున్నా నేను ప్రతీ రోజు పార్టీ కోసం ఏం చేయాలో అది చేస్తున్నాను. గత ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించాను. ఈసారి నాకు ఇష్టమైన రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్నాడు. ఆయన పదవిలో కూర్చుంటే నేను అధికారాన్ని సొంతం చేసుకొన్నట్టే అని బండ్ల గణేష్ అన్నారు.

Producer Bandla Ganesh predicts Revanth Reddy will be CM of Telangana State in 2023 Assembly Elections

జనాలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. నిజాలు, వాస్తవాలు, చేయబోయే సంక్షేమం గురించి చెప్పాం. ప్రజలు నమ్ముతున్నారు. జనం ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగిందనే నిజం. రోజు రోజుకు పెరుగుతున్నదనే విషయం ముమ్మాటికి నిజం. ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి సిద్దంగా ఉంది అని బండ్ల గణేష్ చెప్పారు.

ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు 1 లక్ష మందిని కాంగ్రెస్ పార్టీ విజయవకాశాల గురించి అడిగాను. ప్రజలు చెప్పే స్పందన వింటే ఆనందంతో నా రక్తం ఉప్పొంగుతున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడ్డాను. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉండరు. సేవకులు మాత్రమే ఉంటారు అని బండ్ల గణేష్ తెలిపారు.

Producer Bandla Ganesh predicts Revanth Reddy will be CM of Telangana State in 2023 Assembly Elections

గత 10 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం జరిగితే.. ఇంట్లో ఉండి పార్టీని గెలిపించుకోవాలి. కానీ కుటుంబం మొత్తం రాష్ట్రం మొత్తం పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు. రేవంత్ రెడ్డి బాహుబలిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలుచున్నాడు. ప్రజల అండ మెండుగా ఉంది. ఆయనే సీఎం అవుతాడు అని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు.

తెలంగాణలో 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను డిసెంబర్ 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో దుప్పటి తీసుకొని వెళ్లి అక్కడే పడుకొంటాను అని బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X