twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆషికి 2' రీమేక్ చేస్తున్న బండ్ల గణేష్

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిందీలో విజయవంతమైన 'ఆషికి 2' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకురాబోతున్నారు. మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన ఈ హిందీ చిత్రంలో ఆదిత్యా కపూర్,శ్రద్దా కపూర్ లీడ్ పెయిర్ గా చేసారు. తెలుగు వెర్షన్ కు గానూ సచిన్‌ జోషి(నిను చూడక నేనుండలేను,ఒరేయ్ పండు,మిత్రుడు) హీరో గా ఎంపిక చేసారు. వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి నుంచి సెట్స్ కు వెళ్లే ఈ చిత్రం దర్శకుడు ఎవరు,మిగతా కాస్టింగ్ ఎవరనేది త్వరలో నిర్మాతలు ప్రకటన ద్వారా తెలియచేస్తారు.

    చిత్రం కథేమిటంటే...- రాహుల్ జయకర్ (ఆదిత్య రాయ్ కపూర్) పాప్ సింగర్. అతనికి అశేష అభిమానులు. అతడు ఆడింది ఆట పాడింది పాట. కానీ ఒక్కటే లోపం. తాగుడుకు బానిస. గోవా టూర్‌లో ఉండగా- అర్ధరాత్రి 'బార్'లన్నీ మూసేయటంతో.. ఊరి చివరి బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తన పాటని అంతకంటె మృదు మధురంగా ఆలపించిన ఆరోహి షిక్రె (శ్రద్ధా కపూర్) టాలెంట్‌కి ముగ్ధుడవుతాడు. తనతోపాటు ముంబై వస్తే సింగర్‌ని చేస్తానంటాడు. అతని మాటలు నమ్మి ముంబై చేరుకుంటుంది ఆరోహి. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ ఆస్పత్రి పాలవుతాడు. ఆరోహి చేసే ఫోన్లన్నీ రాహుల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని -రాహుల్ లండన్ వెళ్లాడని చెప్తాడు. దీంతో రాహుల్‌ని అపార్థం చేసుకుంటుంది ఆరోహి. రెండు నెలల తర్వాత రాహుల్ అసలు విషయం తెలుసుకొని ఆరోహి ఉన్న చోటికి వస్తాడు. అతడికి తెలిసిన మ్యూజిక్ కంపెనీలో ఆమెకి అవకాశం ఇప్పిస్తాడు. ఆమెలోని టాలెంట్ లోకానికి తెలుస్తుంది.

    ఇటు సినిమాల్లోనూ అటు ప్రైవేట్ ఆల్బమ్‌లతోనూ బిజీగా మారిపోతుంది. అనుక్షణం ఆమెని అంటిపెట్టుకొని ఉంటూ సలహాలు సూచనలూ చెబుతూ ఆమెలో ధైర్యాన్ని నింపే రాహుల్ రోజుల తరబడి తాగటంవల్ల అతడి గొంతు దెబ్బ తింటుంది. కనీసం లోబడ్జెట్ సినిమాలకైనా పాడదామనుకుంటే అక్కడా ఎదురుదెబ్బ తగులుతుంది. రాన్రాను రాహుల్ పతనమవటం చూసిన ఆరోహి అతణ్ణి మళ్లీ మామూలు మనిషిగా.. గాయకుడిగా తీర్చిదిద్దాలనుకుంటుంది. దాంతో అతడి ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతారిద్దరూ. కానీ - గతంలో చేసిన అగ్రిమెంట్స్ కారణంగా మళ్లీ కెరీర్‌ని ఆరంభించాల్సి వస్తుంది ఆరోహి. తన వల్లనే ఆమె కెరీర్ నాశనమై పోతోందనీ.. తను లేకుంటే ఆరోహి జీవితం బాగుంటుందని తలచి ఆత్మహత్య చేసుకొంటాడు రాహుల్. ఆ తర్వాత ఆరోహి జీవితం ఏమైందన్నది క్లైమాక్స్.

    ఆషికి-2కు మరో రికార్డు ఉంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఏ రేంజిలో పట్టం కట్టారంటే... క్రితం సంవత్సరం ఎక్కువ మంది వెతికిన భారతీయ సినిమాల లో ఈ సినిమా చోటు చేసుకుంది. 'ఆషికి-2' బాలీవుడ్ చిత్రాన్ని లక్షలాది మంది గూగుల్ సర్చ్‌లో గాలించారట. ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలోని 'అప్ నే కరమ్ కీ కర్ అదాయే' అనే మొదటి పాటను యూట్యూబ్‌లో ప్రతి రోజు అనేక మంది వీక్షించారు.

    English summary
    Aashiqui 2, one of the biggest hits in Bollywood last year, is set to be remade in Telugu now. Sachin Joshi will be playing the male lead in the Telugu version. Leading producer Bandla Ganesh will be supervising the production of the Telugu version which will be produced by Viking Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X