పూరీకి బండ్ల గణేష్ గిఫ్ట్ రూ. 44 లక్షల లైటర్

By Pratap

హైదరాబాద్: డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ 44 లక్షల రూపాయల విలువ చేసే లైటర్‌ను బహుమానంగా ఇచ్చారు. ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. 1455 వజ్రాలు పొదిగిన ఈ లైటర్‌ను చాలా అరుదైన బహుమానంగా చెప్పవచ్చు.

ఇంత విలువైన బహుమతిని పూరికి ఇవ్వడానికి గల కారణమేమిటని అడిగితే - పూరి జగన్నాథ్ గారికి ప్రజెంట్ చేసిన ఈ గిఫ్ట్ చాలా చిన్నదని తన అభిప్రాయమని, ఈ బహుమతితో పోలిస్తే పూరి జగన్నాథ్ విలువ చాలా ఎక్కువ అని బండ్ల గణేష్ అన్నారు.

పూరి బర్త్‌డేకి ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిందని, అయితే ఈ లైటర్ రెడీ కావడానికి ఇంతకాలం పట్టిందని, అందుకే ఇప్పుడు ఇచ్చానని ఆయన వివరించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం విజయంతో బండ్ల గణేష్ మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన ఈ చిత్రంతో గొప్ప విజయాన్ని సాధించారు. దీంతో సినీ పరిశ్రమలో గణేష్ అత్యంత ముఖ్యమైన నిర్మాత అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X