»   » మహేష్ పెండింగులో పెట్టడంతో...సీన్లోకి జూ ఎన్టీఆర్‌!

మహేష్ పెండింగులో పెట్టడంతో...సీన్లోకి జూ ఎన్టీఆర్‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబుతో సినిమా చేద్దామని రెడీ అయ్యాడు. కానీ చివరకు మళ్లీ జూ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ నిర్మాతకు. అతనెవరో కాదు...బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడట.

వాస్తవానికి....మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు బండ్ల గణేష్. అయితే ఇతర ప్రాజెక్టుల ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన సినిమాను హోల్డ్‌లో పెట్టాడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయడానికి చాలా సమయం ఉండటంతో ఈ లోగా జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా బండ్ల గణేష్‌కే ఇచ్చాడు. అదన్నమాట సంగతి!

Bandla Ganesh Producer back with NTR

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టోటల్ షూటింగ్ మే నెలలో పూర్తవుతుందని అంటున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తన సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ ఈ సంవత్సరాంతంలోగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

English summary
film Nagar source said that, Bandla Ganesh is the producer for Jr NTR-Puri Jagannath's upcoming flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu