పీచే ముడ్! బండ్ల గణేష్ డిసైడ్ అయ్యాడు, ఎక్కడ మొదలయ్యాడో మళ్లీ అక్కడికే!

బండ్ల గణేష్.. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 25 ఏళ్ల క్రితమే నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన గణేష్ పలు చిత్రాల్లో నటించారు. ఆపై నిర్మాతగా అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు.

నిర్మాతగా ఉన్న సయమంలో బండ్ల గణేష్ చూట్టూ పలు వివాదాలు సైతం ముసురుకున్నాయి. ఆయన కొందరు రాజకీయ నాయకులకు బీనామీ అనే ప్రచారం కూడా జరిగింది. సినిమా రంగానికి సంబంధించిన ఆర్థిక వివాదాల్లో ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

కేసులతో సినిమా ఇండస్ట్రీకి దూరం

కేసులతో సినిమా ఇండస్ట్రీకి దూరం

నిర్మాతగా పలుకేసులు, వివాదాలతో ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. బండ్ల గణేష్ చివరగా నిర్మించిన చిత్రం ‘టెంపర్'. 2015లో ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ నిర్మాణం జోలికి వెళ్లలేదు. షాద్ నగర్ వెళ్లి తమ ఫ్యామిలీకి చెందిన కోళ్ల ఫారం వ్యాపారంలో మునిగిపోయారు.

రాజకీయాల్లో చేరి హడావుడి...

రాజకీయాల్లో చేరి హడావుడి...

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని రాజకీయాల్లో హడావుడి చేసిన బండ్ల గణేష్.. తన ఇంటర్వ్యూలతో అందరినీ నవ్వించాడు. మా పార్టీ ఓడితే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రగల్బాలు పలికాడు. ఆ తర్వాత తూచ్ అంటూ మాట మార్చాడు.

పవన్ కళ్యాణ్‌కు మద్దతు.. రాజకీయ సన్యాసం

పవన్ కళ్యాణ్‌కు మద్దతు.. రాజకీయ సన్యాసం

తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో తన దేవుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించి, ఆయన సీఎం కావాలని ఆకాంక్షించిన గణేష్... తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పీచే ముడ్! బండ్ల గణేష్ డిసైడ్ అయ్యాడు, ఎక్కడ మొదలయ్యాడో మళ్లీ అక్కడికే!

పీచే ముడ్! బండ్ల గణేష్ డిసైడ్ అయ్యాడు, ఎక్కడ మొదలయ్యాడో మళ్లీ అక్కడికే!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్.. తన కెరీర్ ఎక్కడ మొదలైందో అక్కడికే పీచే ముడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఆయన చివరిగా 2012లో వచ్చిన మహేష్ బాబు మూవీ ‘బిజినెస్‌మేన్' చిత్రంలో నటించారు.

మహేష్ బాబు-అనిల్ రావిపూడి మూవీలో

మహేష్ బాబు-అనిల్ రావిపూడి మూవీలో

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... త్వరలో ప్రారంభం కాబోయే మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమా ద్వారా బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నటుడిగా తన ప్రస్తానం కొనసాగించబోతున్న అతడిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X