Just In
- 8 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 39 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా.. బండ్ల గణేష్ ఆవేదన
ప్రస్తుతం హైద్రాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఎప్పటిలానే జనాలెవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఓట్లు వేయడం లేదు. జనాలు లేక కొన్ని పోలింగ్ బూత్‌లో సిబ్బంది నిద్రకూడా పోతున్నారు. సెలెబ్రిటీలందరూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. సాధారణ జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం బయటకు రావడం లేదు.
ఇప్పటి వరకు చిరంజీవి సురేఖ, నాగార్జున అమల, మంచు లక్ష్మీ, కోట శ్రీనివాస్ రావు దంపతులు, యాంకర్ ఝాన్సీ, హీరో రామ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ రెడ్డి ఇలా ఎంతో మంది కదలివచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటలవరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దీనిపై బండ్ల గణేష్ మాత్రం ఆవేదన చెందుతున్నాడు.

దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి ఇది మీ కర్తవ్యం హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ .ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్నా అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా .ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే హక్కును కోల్పోతారు అంటూ ట్వీట్లు చేస్తున్నాడు. సినీ ప్రముఖులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రండి.. ఓట్లు వేసి మీ హక్కును వినియోగించుకుని బాధ్యతను నెరవేర్చుకోండని చెబుతున్నారు.