బయటపడ్డ బండ్ల గణేష్ కోరిక.. సూటిగా రామ్ చరణ్‌‌ని అడిగేశాడు.. ఇష్యూ హాట్ టాపిక్!

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో తనదైన స్టైల్ ప్రదర్శించిన బండ్ల గణేష్ తిరిగి సినీ ఇండస్ట్రీ వైపే చూస్తున్నాడు. అవకాశం దొరికితే భారీ హిట్ కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు సూటిగా రామ్ చరణ్‌‌‌కే స్కెచ్ వేశాడు బండ్ల గణేష్. ఆ వివరాలేంటో చూద్దామా..

కమెడియన్ స్థాయి నుంచి రాజకీయాల వరకు

కమెడియన్ స్థాయి నుంచి రాజకీయాల వరకు

కమెడియన్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో సినిమాలు తీశారు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా వేలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల వైపుకు వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన రామ్‌ చరణ్‌కి ఓ రిక్వెస్ట్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ బాబుతో చేస్తూ రామ్ చరణ్‌‌కి లైన్

మహేష్ బాబుతో చేస్తూ రామ్ చరణ్‌‌కి లైన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు బండ్ల గణేష్. ఇక తన పూర్వ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా సత్తా చాటాలనే ఆలోచనలో పడ్డాడు ఈ కమెడియన్. ఈ మేరకు రామ్ చరణ్‌ని లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్‌లో చివరగా 'పటాస్' సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు బండ్ల గణేష్.

సోషల్ మీడియా వేదికగా అభ్యర్థన

సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కి ట్వీట్ పెట్టాడు బండ్ల గణేష్. ఈ ట్వీట్‌లో.. ''మళ్లీ మీ తో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్'' అని ఆయన అభ్యర్థించాడు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Recommended Video

Chiranjeevi Speech @ Sye Raa Narasimha Reddy Pre Release Event Kerala
గతంలో రామ్ చరణ్‌తో

గతంలో రామ్ చరణ్‌తో

గతంలో రామ్ చరణ్‌తో కలిసి 'గోవిందుడు అందరివాడేలే' సినిమా రూపొందించాడు బండ్ల గణేష్. 2014లో అక్టోబరు 1న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమా విడుదలై నేటితో ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా బండ్ల గణేష్ తన కోరిక వెల్లడించాడు. చూడాలి మరి ఈయన చేసిన రిక్వెస్ట్ పట్ల రామ్ చరణ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X