బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్.. ఇప్పుడేమన్నారో తెలుసా?
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటడు, నిర్మాత బండ్ల గణేష్ మీడియా ఇంటర్వ్యూల్లో తనదైన శైలి వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇంటర్వ్యూ చూస్తున్న వారిలో మాత్రమే కాదు... ఆయన్ను ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులను సైతం నవ్వించాయి. ఆయన సీరియస్‌గానే తన ఓపీనియన్స్ చెబుతున్నా... ప్రజలకు మాత్రం కామెడీ స్టైల్‌లో రీచ్ అయ్యాయి.
అయితే ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక పోతే మీరు డిసెంబర్ 11న బ్లేడు తీసుకుని రండి, ఇదే ప్లేసులో అందరి ముందు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను, గెలిస్తే మీరు నాకు స్వీట్లు ఇవ్వాలి.... అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ విజయంపై బండ్ల గణేష్ ఏమన్నారో తెలుసా?
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందనలు.. అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు?
అయితే బండ్ల గణేష్ చేసిన గతంలో బ్లేడుతో కోసుకుంటాను అంటూ చేసిన వ్యాఖ్యలు పలువురు ఖండించారు. గెలుపు ఓటములు అనేవి ఎక్కడైనా సహజం. ఈ మాత్రం దానికి చావడం లాంటి పిచ్చి పనులకు పాల్పడటం ఎందుకు? అంటూ ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

జోకులు పేల్చిన నెటిజన్లు
అయితే కొందరు మాత్రం బండ్ల గణేష్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోకుండా కామెడీతో వెక్కించారు. ‘‘అన్నా మీరు మాకు కావాలి, మమ్మల్ని మరింత నవ్వించాలి, మీరు లేక పోతే కామెడీ మిస్సవుతాం' అంటూ జోకులు పేల్చారు.

టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం
కాగా... తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అఖండ విజయం అందుకుంది. మొత్తం 119 స్థానాలకు గాను... 88 స్థానాలు సొంతం చేసుకుని క్లీన్ స్వీప్ చేసి తన సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











