ప్రకాశ్ రాజ్‌కు వాళ్ల మద్దతుంది: బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను వాడుతూ షాకింగ్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. సినీ కుటుంబంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీ కోసం పెద్దలంతా పావులు కదుపుతున్నారు ఎప్పుడో సెప్టెంబర్‌లో జరగబోతున్న ఎలెక్షన్ కోసం ఇప్పుడే పలువురు సినీ ప్రముఖులు పోటీలో ఉన్నారు. అదే సమయంలో ప్యానెళ్లను కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Recommended Video

Corona Effect, తండ్రికి క్షవరం చేసిన Bandla Ganesh || Filmibeat Telugu
అప్పుడే మొదలైన ఎన్నికల వేడి

అప్పుడే మొదలైన ఎన్నికల వేడి

తెలుగు సినీ పరిశ్రమలోని ఆర్టిస్టుల సమస్యల పరిష్కారానికై ఏర్పాటైన సంఘమే 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'. దీనికి ఎంతో మంది స్టార్లు అధ్యక్షులుగా పని చేశారు. కొంత కాలంగా ఈ పదవి కోసం చాలా మంది ప్రముఖులు పోటీ పడుతున్నారు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లో మా ఎలెక్షన్ జరగనుండగా.. అప్పుడే హడావిడి మొదలైంది.

నలుగురి మధ్య నెలకొన్ని ఎన్నిక

నలుగురి మధ్య నెలకొన్ని ఎన్నిక

సినీ పరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నిక కోసం ఈ సారి ఏకంగా నలుగురు ప్రముఖులు పోటీలో నిలిచారు. ఇందులో ముందుగా ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మంచు విష్ణు బరిలో నిలిచారు. వీళ్లను ఢీ కొట్టేందుకు జీవితా రాజశేఖర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హేమ కూడా ఈ సారి పోటీ చేస్తున్నారు.

ప్యానెల్‌ను ప్రకటించిన ప్రకాశ్ రాజ్

ప్యానెల్‌ను ప్రకటించిన ప్రకాశ్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ 'మా' అధ్యక్ష పదవి కోసం ముందు నుంచే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సినీ పెద్దల నుంచి మద్దతును కూడగట్టుకోగలిగారు. అలాగే, మా కోసం ఓ భవనాన్ని నిర్మిస్తానని కూడా హామీ ఇస్తున్నారు. అంతేకాదు, గురువారమే 27 మంది సభ్యులతో కూడిన తన ప్యానెల్‌ను ప్రకటించారు. దీంతో ప్రకాశ్ రాజ్ పేరు మారుమ్రోగుతోంది.

ప్రెస్‌మీట్... బండ్ల గణేష్ కామెంట్స్

ప్రెస్‌మీట్... బండ్ల గణేష్ కామెంట్స్

ప్రకాశ్ రాజ్ తాజాగా తన ప్యానెల్ సభ్యులందరితో కలిసి ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తన ప్రణాళికలు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయబోయే అభివృద్ధి పనుల గురించి క్షుణ్ణంగా వివరించారు. అలాగే, లోకల్ నాన్ లోకల్ అనే సున్నితమైన అంశంపైనా క్లారిటీ ఇచ్చారు. ఆయన తర్వాత బండ్ల గణేష్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే షాకింగ్ కామెంట్స్ చేశాడు.

భూమి ఇస్తే.. అలాంటి పని చేశాడు

భూమి ఇస్తే.. అలాంటి పని చేశాడు

ఈ ప్రెస్‌మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. 'ప్రకాశ్ రాజ్ అన్నకు 23 ఏళ్ల క్రితం షాద్‌నగర్‌లో 10 ఎకరాల భూమి ఇచ్చాను. అక్కడ ఆయన ఫాంహౌస్ నిర్మించుకుని.. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆయా గ్రామాల వాళ్లకు సేవలు చేస్తున్నాడు. కరోనా టైమ్‌లోనూ అన్ని సదుపాయాలూ అందించాడు. ఆయనేంటో షాద్ నగర్ వస్తే తెలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు.

చాలా చేశాడు.. పేర్లు చెప్పకూడదు

చాలా చేశాడు.. పేర్లు చెప్పకూడదు

తన స్పీచ్ కొనసాగిస్తూ.. 'ప్రకాశ్ రాజ్ సినీ పరిశ్రమలోని చాలా మంది ఆర్టిస్టులకు కూడా సహాయం చేశాడు. కొందరు పిల్లల పెళ్లిళ్లకు, చదువుకు లక్షలు ఇచ్చాడు. ఇక్కడ వాళ్ల పేర్లు చెప్పడం భావ్యం కాదు. అందుకే ఎంతో మంది ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు సపోర్ట్ చేస్తున్నా. అడుగులో అడుగు వేస్తున్నా' అంటూ వివరించాడు బండ్ల గణేష్.

ప్రభాస్, రాజమౌళి పేర్లను వాడుతూ

ప్రభాస్, రాజమౌళి పేర్లను వాడుతూ

ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అన్న దానిపై స్పందిస్తూ.. 'లోకల్ నాన్ లోకల్ ఏంటండి.. ఇక్కడి ప్రభాస్ దేశాన్ని ఏలుతున్నాడు. ఇక్కడ పుట్టిన రాజమౌళితో ఇంగ్లీష్ వాళ్లు సినిమా తీయమని అడుగుతున్నారు. సేవ చేయడానికి ఎవరైతే ఏంటండి? ప్రకాశ్ రాజ్ వెళ్లి కర్నాటకలో సేవ చేయొచ్చు కదా. కానీ, ఇక్కడ చేస్తా అంటున్నాడు. చేయనీయండి' అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు.

వాళ్ల సపోర్ట్ ఉంది.. చేసి చూపిస్తాడు

వాళ్ల సపోర్ట్ ఉంది.. చేసి చూపిస్తాడు

ప్రకాశ్ రాజ్‌కు ఉన్న సపోర్ట్ గురించి బండ్ల గణేష్ చెబుతూ.. 'ఇప్పటి వరకూ ఎంతో మంది 'మా'కు అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్లంతా గొప్పవారే. కానీ వాళ్ల కంటే ప్రకాశ్ రాజ్ ఎక్కువే చేస్తాడు. ఎన్నికల్లో గెలుస్తున్నాడు.. బిల్డింగ్ కూడా కట్టిస్తాడు. అందరి మెప్పునూ పొందుతాడు. మాకు పెద్ద వాళ్ల సపోర్ట్ ఉంది. కాబట్టి కచ్చితంగా గెలుస్తాం. మీడియా కూడా సపోర్ట్ చేయాలి' అని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X