twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీది నీచ చరిత్ర.. నీవు స్కామ్ రాజా.. అరెస్ట్ చేస్తారటగా? బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం

    |

    సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్‌లో రెచ్చిపోయాడు. టాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త పీవీపీని పరోక్షంగా టార్గెట్ చేసుకొని ట్వీట్ల వర్షం కురిపించారు. పదునైన, ఘాటైన మసాల దట్టించి ట్వీట్లతో హల్‌చల్ చేశారు. తాజాగా వారిద్దరి మధ్య టెంపర్ చిత్రం చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా వివాదం కారణంగా ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్లతో బండ్ల గణేష్ హడలెత్తించారు. ఆయన ట్వీట్ల పదును మీరు లుక్కేయండి..

    కమల్ హాసన్‌ను కోర్టుకు లాగి

    కమల్ హాసన్‌ను కోర్టుకు లాగి

    పీవీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ మండిపడ్డారు. ప్రపంచం, భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్‌ను కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీది అంటూ ట్వీట్‌తో భగ్గమన్నాడు. తన ఫిర్యాదును ఏపీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్‌సీపీకి ట్యాగ్ చేయడం విశేషంగా మారింది.

    ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా

    ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా

    ప్రపంచంలో నేను ఎక్కడికైనా వెళ్తే హ్యాపీగా తిరిగి వస్తాను. కొందరు స్కామ్‌రాజాలు వేరే దేశాలకు వెళ్తే అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారట. అందరూ అంటుంటే నాకు తెలిసింది. అది నిజమో కాదో నాకు తెలియదు అంటూ మరో ట్విట్‌లో బండ్ల గణేష్ సెటైర్ వేశాడు.

    ప్రతీ హీరో, డైరెక్టర్‌తో గొడవే

    ప్రతీ హీరో, డైరెక్టర్‌తో గొడవే

    ఇక ఆయన సినిమా తీస్తే.. ప్రతీ హీరోతో గొడవే. ప్రతీ డైరెక్టర్‌తో పంచాయితీనే. ప్రతీ నటుడితో గొడవలే. మాట్లాడితే కోర్టులు, కేసులు, ఇండస్ట్రీకి హిట్లు, బ్లాక్‌బస్టర్లు తెలుసు గానీ.. కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా అని బండ్ల గణేష్ ఎద్దేవా చేశాడు.

     మేకప్‌కు.. ప్యాకప్‌కు తేడా తెలియదు

    మేకప్‌కు.. ప్యాకప్‌కు తేడా తెలియదు

    నిర్మాత బండ్ల గణేష్ ఓ అడుగు ముందేసి.. డేకి, వర్కింగ్ డేకి, కాల్‌షీట్‌కు తేడా తెలియదంటూ మరో సెటైర్ వేశాడు. అలాగే మేకప్‌కు ప్యాకప్‌కు కూడా తేడా తెలియదు. ఇండస్ట్రీని స్కామ్ రాజాలు భ్రష్టుపట్టించారు అంటూ బండ్ల గణేష్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Tollywood producer Bandla Ganesh satires on Producer PVP. He tweeted serial tweets on targetting the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X