నేను ఎవరికీ బానిసను కాను.. బండ్ల గణేష్ కామెంట్స్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన బండ్ల గణేష్ కమెడియన్‌గా ఎదిగి.. టాప్ ప్రొడ్యూసర్‌గా స్టార్ స్టేటస్‌ను అనుభవించాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్‌తో సినిమాలను తెరకెక్కించి.. బడా ప్రొడ్యూసర్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. మధ్యలో రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడంతో అంతా తారుమారైంది.అటు సినిమా పరిశ్రమకు, ఇటు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రీసెంట్‌గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చినా.. వర్కౌట్ కాలేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న రీఎంట్రీ కాన్సెప్ట్ మళ్లీ మూలకు చేరుకుంది. సరిలేరు నీకెవ్వరులో బండ్ల గణేష్ పోషించిన క్యారెక్టర్ సినీ కెరీర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అయితే బండ్ల గణేష్ మాత్రం గత కొన్ని రోజులు పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు వంటి హీరోలను కాకపడుతున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు.

అయితే బండ్ల గణేష్ తాజాగా చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. తనపై వచ్చే నెగెటివ్ కామెంట్స్‌ను పట్టించుకోనని తేల్చి చెబుతున్నాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'నా పై వచ్చే విమర్శలు నేను ఎప్పుడు చదవను ఎందుకంటే అవి నేనంటే నచ్చని వారి కోసం రాసినవి , నేనేంటో నాకు తెలుసు .నా అభిప్రాయాన్ని రాస్తూ ఉంటా నేను ఎవరికీ బానిసని కాదు' అంటూ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











