Bheemla Nayak ఈవెంట్‌ ముందు బండ్ల గణేష్ కాల్ రికార్డింగ్ లీక్.. ఆ పార్టీతో త్రివిక్రమ్‌కు లింక్ అంటూ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. అంతేకాదు, టాలీవుడ్‌లో సెలెబ్రిటీలనే అభిమానులుగా మార్చుకున్నాడు.

పవన్‌ను ఓ రేంజ్‌లో ఆరాధించే ప్రముఖుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకడు. తాజాగా ఆయన పవర్ స్టార్ అభిమానితో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు ఇది కలకలం రేపుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే!

ఇద్దరు హీరోల పోరుతో భీమ్లా నాయక్

ఇద్దరు హీరోల పోరుతో భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటించిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుతో తెరకెక్కింది.

‘భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్

‘భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 21 అంటే ఈరోజు నిర్వహించబోతున్నారు. దీనికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా వస్తున్నారు.

పవన్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ క్రేజ్

పవన్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ క్రేజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ పరమ భక్తుడన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన ప్రతి సినిమా ఫంక్షన్‌కూ అభిమానిగా వస్తుంటాడు. అలా ఆ మధ్య రెండు మూడు ఈవెంట్లలో బండ్ల గణేష్ పవన్‌పై భక్తిని తన వ్యాఖ్యల ద్వారా బయట పెడుతూనే ఉన్నాడు. దీంతో అతడికి కూడా భారీ క్రేజ్ పెరిగింది. ఇలా పవన్ ఫంక్షన్‌లో ఈ భక్తుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు.

ఈవెంట్‌కు ముందు బండ్ల కాల్ లీక్

ఈవెంట్‌కు ముందు బండ్ల కాల్ లీక్

భీమ్లా నాయక్ మూవీ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు.. బండ్ల గణేష్ పేరిట ఒక వ్యక్తి.. అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ తాజాగా లీకైంది. ఇందులో సదరు ఫ్యాన్‌ ఆయనను భీమ్లా నాయక్ ఈవెంట్‌కు వెళ్తున్నావా? అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలోనే బండ్ల గణేష్ ముందు వెళ్తున్నానని.. ఆ తర్వాత తనపై కుట్ర జరిగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

వెళ్తున్నా.. స్పీచ్ కూడా రెడీ చేశాను

వెళ్తున్నా.. స్పీచ్ కూడా రెడీ చేశాను

తాజాగా బయటకు వచ్చిన కాల్ రికార్డింగ్‌లో ఓ కుర్రాడు 'బండ్లన్నా.. అన్నా రేపొద్దున్న జరిగే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్తున్నావా అన్నా. స్పీచ్ ఏమైనా రెడీ చేసుకున్నావా' అని ప్రశ్నించాడు. దీనికి బండ్ల గణేష్‌గా చెబుతున్న వ్యక్తి 'అవును.. వెళ్తున్నానమ్మా. స్పీచ్ కూడా రెడీ చేసుకున్నాను. కానీ, వాళ్లు నన్ను ఇంకా పిలవలేదమ్మా' అంటూ చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్‌పై సంచలన ఆరోపణలు

త్రివిక్రమ్‌పై సంచలన ఆరోపణలు

ఇక, ఇదే ఫోన్ సంభాషణలో బండ్ల గణేష్‌గా చెబుతున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. 'ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను పిలవలేదమ్మా. ఆ త్రివిక్రమ్ గాడు డౌన్ అవుతాడని నన్ను రావొద్దన్నడంట. వాడు వైసీపీ నాయకులతో కలిసి పెద్ద ప్లాన్ చేసుకున్నాడు. అందుకే వెళ్లడం లేదమ్మా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బండ్లన్న రావాలి అని అరవండి

ఈ కాల్ రికార్డింగ్‌ చివర్లో పవన్ అభిమాని 'నువ్వు లేకపోతే ఈవెంట్‌లో చాలా మిస్ అవుతామన్నా. పిలవకపోయినా వచ్చేయండి' అన్నాడు. దీనికి బండ్ల గణేష్‌గా చెబుతున్న వ్యక్తి 'పిలవకుండా వస్తే బాగోదు. అందరూ అరవండి. రేపు ఆడిటోరియం మొత్తం బండ్లన్న బండ్లన్న అని అరిస్తే.. నేను పక్కనే ఉంటాను. వెంటనే అక్కడకు వచ్చేస్తాను' అని సలహా ఇచ్చాడు.

ఈ ఆడియో క్లిప్ నిజమా? కాదా?

ఈ ఆడియో క్లిప్ నిజమా? కాదా?

తాజాగా వచ్చిన ఆడియో ఫైల్ నిజమా కాదా అనే విషయంపై చర్చ జరుతున్నది. దీనిపై బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తే తప్ప.. అసలు మ్యాటర్ బయటకు రాదు. అయితే ప్రస్తుతం ఈ ఆడియో ఫైల్ యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు ఇలాంటి ఆడియో ఫైల్ బయటకు రావడం ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X