Bandla Ganesh: భార్యాబిడ్డల్ని ప్రేమించనోడు మనిషా.. పూరి జగన్నాథ్ పై బండ్ల గణేష్ ఫైర్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూరి భార్యను లావణ్యను పొగుడుతూ ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు అని, అలాగే ఆకాష్ ను మెచ్చుకుంటూ.. కన్న కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ఏం చేస్తున్నావ్ అన్నా.. అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బండ్ల గణేష్ మరోసారి పూరిపై విరుచుకుపడ్డాడు.

పరోక్షంగానో, డైరెక్ట్ గానో..
తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. అలాగే ప్రముఖ నిర్మాతగా, నటుడిగా పేరు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య పరోక్షంగానో, డైరెక్ట్ గానో మాటల యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఉదహారణే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ విమర్శలు. అలాగే ఆ వ్యాఖ్యలకు పరోక్షంగా పూరి జగన్నాథ్ కౌంటర్ ఇవ్వడం.

పూరి జగన్నాథ్ పై షాకింగ్ కామెంట్స్..
ఇక తాజాగా బండ్ల గణేష్ తనదైన స్టైల్ లో పూరి జగన్నాథ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ప్రోమో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ముందుగా యాంకర్.. వ్యాపారాలు, వ్యాపకాలు చాలానే ఉన్నాయి కదా.. వాటిని పక్కన పెట్టి రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నారు అని ప్రశ్నించగా.. నేను ఎక్కడ కెలికాను. నన్ను ఇరికించాలను చూడకు. శకుని క్యారెక్టర్ నా దగ్గర ప్లే చేయకు అంటూ బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పోసాని చావు మాములుగా ఉండదు..
ఆ తర్వాత పోసాని చావు మాములుగా ఉండదు అని చెప్పడానికి మీరెవరు.. ఆయనకు కూడా ఓ కుటుంబం ఉంటుంది కదా.. అని యాంకర్ అడగడంతో నువ్ పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు. కేటీఆర్ గారి అంటే సమాధానం ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. లింక్ లు పెడితే చెప్పను.. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టాలి. అంతేకానీ మా అమ్మ నాయన ఏం చేశారు. అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

నాలుక జాగ్రత్తగా పెట్టుకో..
నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని పూరి గారు ఎందుకు స్పందించారని హోస్ట్ అడిగ్గా.. భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషా అన్నా.. అని తిరిగి ప్రశ్నించాడు బండ్ల గణేష్. ప్రేమించడం, ప్రేమించకపోవడం ఆయన ఇష్టం అని యాంకర్ అంటే.. పూరి అనే వాడికి మంచి చెడు చెప్పే రైట్ నాకుంది.. నా ఫ్రెండ్.. పెట్టు ఫోన్.. అంటూ సీరియస్ గా మాట్లాడాడు బండ్ల గణేష్. ప్రస్తుతం వాడివేడిగా ఈ సాగిన ఈ ప్రోమో యూట్యూబ్ లో రచ్చ చేస్తోంది.

ముంబైలో ఏం చేస్తున్నావ్ అన్నా..
ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన బండ్ల గణేష్ కన్న కొడుకు సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ముంబైలో ఏం చేస్తున్నావ్ అన్నా, నేనైతే లండన్ లో ఉన్న కొడుకు ఈవెంట్ ఉంది అంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అయినా వచ్చేవాడిని. అంటూ పూరి జగన్నాథ్ భార్య కుమారుడిని, పొగుడుతూ పూరి జగన్నాథ్ మీద తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశాడు.

నేరుగా స్పందించకుండా..
దీంతో ఈ విషయం మీద పూరిజగన్నాథ్ స్పందించాడు. అయితే ఆయన నేరుగా స్పందించకుండా మ్యూజింగ్స్ ద్వారా బండ్ల గణేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనే విషయం తెలిసిందే. మ్యూజింగ్ కింద కామెంట్స్ చూస్తే 'బండ్ల గణేష్ స్పీచ్ కి సంబంధించి గట్టి కౌంటర్ ఇచ్చాడు...' అని చాలా మంది కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

చెప్పింది వింటూ ఉంటే మంచిది..
అయితే అసలు పూరి జగన్నాథ్ ఏమని అన్నాడనే విషయానికి వస్తే... ''గుర్తు పెట్టుకోండి! మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం అని అన్నారు. అందుకే, జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా అంటే ఇతరులు చెప్పింది వింటూ ఉంటే మంచిదని అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు... క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు... ఆఫీస్ పీపుల్ కావచ్చు... ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండన్న ఆయన, చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దని అన్నారు.


Click it and Unblock the Notifications











