Telangana Elections 2023 ఓటమికి కారణం కేటీఆర్.. బీఆర్ఎస్ హిట్ వికెట్.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ సానుభూతిపరుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ విజయం కోసం ఎదురు చూస్తున్న ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి మంత్రి కేటీఆర్ అహంకార పూరిత మాటలే కారణమని ఆయన ఆరోపించారు. మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడుతూ..
రాజకీయాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియల్ హీరో. తన ప్రాణాలను పణంగా పెట్టి తనకంటూ చరిత్రను రాసుకొన్నాడు. తన కూతురు పెళ్లికి గెస్టుగా వచ్చి.. ఎవరితో మాట్లాడకుండా తిరిగి జైలుకు వెళ్లాడు. కేసీఆర్ ప్రభుత్వం అతడిని అనేక రకాలుగా వేధించింది. అలాంటి వాటిని తట్టుకొని ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని బండ్ల గణేష్ అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి ఆ పార్టీ నేతల వ్యవహరించి తీరు, వారి ప్రవర్తన ప్రధాన కారణం. తాము మానవులం కాదు.. దేవుళ్లమనే రీతిలో ప్రవర్తించారు. వారి అహంభావాన్ని తట్టుకోలేక మీరు కూడా మానవులే అని ఈ ఓటమితో వారికి గుర్తు చేశారు. మా బ్రీడ్ వేరు అంటూ విర్రవీగిన వారికి ప్రజలు గుణపాఠం నేర్పారు అని ఆయన చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత కేటీఆర్ తదితరులు మాట్లాడిన తీరు అభ్యంతరంగా మారాయి. ఏపీ విషయాలు ఇక్కడెందుకు? ఆంధ్రాకు వెళ్లి ధర్నాలు చేసుకోండి. విజయవాడకు వెళ్లి ధర్నాలు చేసుకోమని అనడం తప్పు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ప్రజలపై దౌర్జన్యం చేయడం దారుణం అని బండ్ల గణేష్ చెప్పారు.

కేటీఆర్ ఎక్కు పెట్టిన గన్ మిస్ ఫైర్ అయింది. ఎదుటివాడిని కాల్చాలనే ప్రయత్నం ఫలించకపోగా, వారిని వారే కాల్చుకొన్నారు. కేటీఆర్ హిట్ వికెట్ అయ్యారు. దైవాంశ సంభూతులమనే ఫీలింగ్ నుంచి ప్రజలు బయటపడేశారు. కాంగ్రెస్ పార్టీ గెలువాలని ప్రతీ రోజు తపన పడ్డాను. గత ఐదేళ్లలో ఎంతో మనో వేధనకు గురయ్యాను అని బండ్ల గణేష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











