Posani చావు భయంకరంగా ఉంటుంది.. లైవ్‌లో ప్రకాష్ రాజ్‌ను ఒప్పించిన బండ్ల గణేష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఆ వ్యవహారం చల్లారలేదు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చాలా బాగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ తర్వాత మరో రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పవన్ కుటుంబ సభ్యులు గురించి అసభ్యంగా మాట్లాడడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా ఈ విషయం మీద బండ్ల గణేష్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

బండ్ల సంచలనం

బండ్ల సంచలనం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ ఈ విషయం మీద నేరుగా స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన నేరుగా స్పందించకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గతంలో పోసాని కృష్ణమురళి పొగుడుతున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో కృష్ణ మురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులోనే కాక దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో అని చెప్పుకొచ్చారు. తాను ఒక బ్లాంక్ చెక్ ఇస్తానని పవన్ ఎంత రాసుకున్న రాసుకుని ఒక సినిమా చేయాలని కోరారు. దానిని జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం నేరుగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల మీద స్పందించారు.

అందుకే సైలెన్స్

అందుకే సైలెన్స్

నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అని ఇన్ని రోజులు ఆయన మౌనం వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు పోటీ నుంచి వెనక్కి తగ్గిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజు ప్యానల్ కి మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అదే టీవీ స్టూడియో లో ఉన్న ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలుపుతూ తాను పోటీ చేసినా చేయకపోయినా తాను పేద కళాకారులకు కట్టిస్తాం అన్న 100 బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని హామీకి కట్టుబడి ఉంటానని అన్నారు.

ఒప్పుకున్న ప్రకాష్ రాజ్

ఒప్పుకున్న ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ ని ఒప్పించి ఆయనని ముందు నిలబెట్టి ఆ హామీ నెరవేరుస్తానని అన్నారు.. లైవ్ లో ఇలా అడగడంతో ప్రకాష్ రాజ్ కూడా హుందాగా స్పందించారు అది మంచిపనే కదా తగిన ప్లాన్ నిధులతో వస్తే కట్టిస్తామని అన్నారు. ఇక పోసాని కామెంట్స్ గురించి స్పందిస్తూ బండ్ల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పోసాని కృష్ణమురళి ఒక ఎక్స్పైరీ టాబ్లెట్ లాంటి వాడు అని పేర్కొన్న ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారి సంక నాకే వ్యక్తి అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

కూడు పెడుతున్న ఆ కుటుంబాన్ని

కూడు పెడుతున్న ఆ కుటుంబాన్ని

80 ఏళ్లు పైబడిన పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ గురించి దారుణంగా మాట్లాడాడు, ఒక మెగాస్టార్ పవర్ స్టార్ లాంటి వాళ్లకు జన్మనిచ్చి అనేక మంది హీరోలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించి ఎంతో మందికి కూడు పెడుతున్న ఆ కుటుంబాన్ని అనరాని మాటలు అన్నాడని ఆ తల్లిని అంత మాట అన్న పోసాని కృష్ణమురళి చావు భయంకరంగా ఉంటుందని అన్నారు.

భయంకరమైన చావు

భయంకరమైన చావు

ఇక అసలు ఆ తల్లి బయటికి రాదు అని అలాంటి తల్లిని అనడానికి నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎన్ని తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఆయన కుటుంబాన్ని లాగడం తనకి నచ్చలేదని అన్నారు. తాను పోసాని కృష్ణమురళి భార్యను గౌరవిస్తానని చెప్పిన బండ్ల గణేష్ పోసాని కృష్ణ మురళి చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలని అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X