జబర్దస్త్ జడ్జ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్.. రోజా లాంటివారు అలా చేస్తే!
ఫైర్ బ్రాండ్ రోజాపై మరో ఫైర్ బ్రాండ్ బండ్ల గణేష్ చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరూ సినీ తారలుగా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతలుగా ఎదిగిన వారే. ఈ నేపథ్యంలో జబర్దస్త్ జడ్జ్ రోజా చేసిన పనిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి పోతే..
Recommended Video

ఏక కాలంలో ఆ రెండు పనులు.. రోజా జబర్దస్తీ
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఇటు రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉంటూనే అటు బుల్లితెర జబర్దస్త్ షో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. రోజా జబర్దస్తీ చూసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న రోజా తన సామాజిక మాధ్యమం ద్వారా ఓ వీడియో షేర్ చేసింది.

ఇంటికే పరిమితమైన రోజా.. ఆ వీడియోతో!
ఇంటికే పరిమితమై తన కుటుంబంతో సరదాగా గడుపుతున్న రోజా.. కుటుంబ సభ్యుల కోసం తాను చికెన్ వంటకాల్ని చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చికెన్, గుడ్లు బాగా తినాలని దీనివల్ల మనలో హ్యుమానిటీ శక్తి పెరుగుతుందని తెలిపింది. అంతేకాదు కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి ఇవి చాలా తోడ్పడుతాయని చెప్పింది.

పరోక్షంగా అందరికీ తెలిసిపోయింది.. బండ్ల గణేష్ ఎంటర్
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రోజా ఇలా తాను వంట చేస్తున్న వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. రోజా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేసుకున్నారు. దీంతో ఈ కరోనా వైరస్ విజృంభణ సమయంలో చికెన్, గుడ్ల ఆవశ్యకత పరోక్షంగా అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో రోజా వీడియో చూసి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు.

రోజా లాంటివారు అలా చేస్తే!
ధన్యవాదాలు ఆర్కె రోజా సెల్వమణి గారు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ మేరకు రోజా వంట చేస్తున్న వీడియో షేర్ చేసిన బండ్ల గణేష్.. ''రోజా గారి వల్ల మా లాంటి పౌల్ట్రీ పరిశ్రమపై ఉన్న అపోహలు తొలిగే అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చికెన్ పై వస్తోన్న అపోహలను తొలిగిస్తే బాగుంటుంది. చికెన్ మరియు గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ రాదని అవగాహన కల్పిస్తే తమ లాంటివాళ్ళము నష్టాల బాట పట్టకుండా ఉంటాము'' అని పేర్కొన్నాడు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ బిజినెస్.. కరోనా దెబ్బ
బండ్ల గణేష్ తెలంగాణలోనే టాప్ మోస్ట్ పౌల్ట్రీ బిజినెస్‌మేన్. ఆయన సినిమాలు నిర్మించడానికి కూడా కారణం కూడా తన పౌల్ట్రీ పరిశ్రమే అని చాలా సార్లు చెప్పుకున్నారు. అలాంటి బండ్ల గణేష్ వ్యాపారం కరోనా దెబ్బకు వణికిపోయింది. కరోనా భయంతో జనమంతా చికెన్ తినడం మానేయడంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
సీఎం కేసీఆర్‌పై బండ్ల గణేష్
ఇలాంటి తరుణంలో కేసీఆర్ కూడా స్పందిస్తూ చికెన్ తినడం వల్ల కరోనా రాదనీ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో కాస్త ఊరట చెందిన బండ్ల గణేష్.. ''దండాలయ్య నువ్వు వందేళ్లు చల్లగా ఉండాలి అయ్యా'' అంటూ సీఎం కేసీఆర్ కి కూడా ధన్యవాదాలు చెప్పాడు.


Click it and Unblock the Notifications











