twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వకీల్ సాబ్’కు అన్యాయం.. వాళ్లంతా ఏకమయ్యారు: సినీ ప్రముఖులపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

    |

    దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దీంతో అతడి అభిమానులు వారం రోజుల ముందు నుంచే తెగ హడావిడి చేసేశారు. తమ అభిమాన హీరో సినిమాను పండుగలా జరుపుకోవాలని థియేటర్లను ముస్తాబు చేశారు. తీన్మార్ స్టెప్పులతో బాణాసంచా వెలుగులతో పవన్‌కు ఘనమైన స్వాగతం పలికాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా హిట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'వకీల్ సాబ్' చుట్టూ ఓ వివాదం రాజుకుంది. తాజాగా దీనిపై స్పందిస్తూ సినీ ప్రముఖులపై సంచలన పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. ఆ వివరాలు మీకోసం!

    వకీల్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

    వకీల్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

    వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రమే 'వకీల్ సాబ్'. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం సమకూర్చాడు. ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే పవర్‌ఫుల్ లాయర్‌గా నటించాడు పవన్.

    షోలన్నీ రద్దు.. జగన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

    షోలన్నీ రద్దు.. జగన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కరోనా విజృంభిస్తోన్న వేళ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోలు పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగకపోవడంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

    టికెట్ ధరలపై ప్రభుత్వంతో వకీల్ ఫైట్

    టికెట్ ధరలపై ప్రభుత్వంతో వకీల్ ఫైట్

    సాధారణంగా పెద్ద హీరో సినిమా విడుదల అవుతుందంటే ఒక వారం రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకుంటారు. ఇప్పటి వరకూ ఇదే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. అయితే, 'వకీల్ సాబ్' మూవీ టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ యాజమాన్యాలు ఫిక్స్ చేసిన రేట్లను తక్షణమే తగ్గించాలని రిలీజ్ ముందు రోజే ఆదేశించింది.

    కోర్టుకు చేరిన గొడవ.. సినిమాకు షాక్

    కోర్టుకు చేరిన గొడవ.. సినిమాకు షాక్

    ప్రాంతాల వారీగా టికెట్ ధరలను ఇలా నిర్ణయించాలని చూపిస్తూ ఓ పట్టికను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు ఎదురు తిరిగాయి. దీంతో పెద్ద ఇష్యూ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోర్టుకు సైతం వెళ్లింది. అక్కడ సింగిల్ బేంచ్ జడ్జ్ టికెట్ రేట్లను తగ్గించాలని పిటీషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు

    వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్

    వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్

    బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై 'వకీల్ సాబ్' నిర్మాత దిల్ రాజు పెద్దగా స్పందించలేదు. వాళ్లు ఏం చేసినా సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివాదంలోకి ప్రముఖ నిర్మాత.. పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశాడు.

    సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు

    సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు

    'వకీల్ సాబ్' సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఓ న్యూస్ వెబ్‌సైట్ కథనాన్ని రాసింది. దీన్ని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన బండ్ల గణేష్.. 'వకీల్ సాబ్.. ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించదా' అంటూ ఓ పోస్టును పెట్టాడు. అంతేకాదు, ఆ తర్వాత 'దీన్ని వకీల్ సాబ్‌తో ఆపేస్తారా' అంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు రేగాయి.

    Recommended Video

    Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
    వాళ్లంతా ఏకమయ్యారు అంటూ పోస్టు

    వాళ్లంతా ఏకమయ్యారు అంటూ పోస్టు

    సినీ పెద్దల తీరును విమర్శిస్తూ బండ్ల గణేష్ చేసిన పోస్టుకు మద్దతు లభిస్తోంది. ఆయనకు అనుకూలంగా ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు. ఇవి కాక.. ఓ నెటిజన్ 'మొన్న కర్ణాటక ప్రభుత్వం సడన్‌గా 50 శాతం అక్యూపెన్సీని ప్రకటిస్తే కన్నడ ఇండస్ట్రీ ఒక్కటై వ్యతిరేకించింది. తెలుగులో మాత్రం కనీస స్పందన లేదు' అని చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ మరో పోస్టు పెట్టాడు.

    English summary
    Pawan Kalyan is actor who showing more impact over young star with his positive attitude. Within shot gap he turned into major icon of all Telugu people. In Few Days Pawan Kalyan Re entry To Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X