రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే.. కర్ణాటక మిమ్మల్ని రాష్ట్రం నుంచి.. బీజేపీపై బండ్ల గణేష్ ఫైర్
దేశ ప్రజలందరినీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, రాజకీయాలు ఆకర్షిస్తున్న నేపథ్యంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికరమైన ట్వీట్లతో సంచలనం రేపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత వరకు వరుస ట్వీట్లతో ఆకట్టుకొన్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రకరకాల శపథాలు చేసి అభాసుపాలైన బండ్ల గణేష్ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ తాజాగా పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తున్న ఆయన బీజేపీపై సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
రాజకీయాలకు జైజై అంటూ: రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్.. నా రాజకీయ భవిష్యత్‌పై త్వరలో నిర్ణయం తీసుకొంటాను. నీతిగా, నిజాయితీగా, నిబద్దతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తాను. బానిసత్వానికి భాయ్ భాయ్.. నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై అంటూ వరుస ట్వీట్లతో బండ్ల గణేష్ ఆకట్టుకొన్నారు.

అందుకే రాజకీయాల్లోకి వస్తా: నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో చేరాలి.. రావాలి.. అందుకే వస్తా అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

ఆయనకు సీఎం పోస్ట్ ఇవ్వండి: కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటక నేత డీ శివకుమార్‌కు మద్దతు ఇస్తూ ట్వీట్ చేశారు. కర్ణాటకకు భవిష్యత్ నేత, కర్ణాటకలో యూత్‌ను ఆకట్టుకొనే నేత, కష్టానికి, హర్డ్ వర్కింగ్‌కు మరో పేరు డీ శివకుమార్. ఆయనను సీఎంగా చేస్తే కర్ణాటక బాగుపడుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ లీడర్లకు నా విన్నతి. ఆయన గత 5 ఏళ్లుగా పార్టీకి ఎంతో సేవ చేశారు అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

బీజేపీపై శివమెత్తిన బండ్ల గణేష్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీపై బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే.. కర్ణాటక ప్రజలు తమ రాష్ట్రం నుంచి మిమ్మల్ని ఖాళీ చేయించారు అంటూ బండ్ల గణేష్ ఘాటైన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో చేశారు. బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











