ఐటీ ఆఫీసుకు బండ్ల గణేష్, దొరికి పోయాడా?
హైదరాబాద్: 'గబ్బర్ సింగ్' చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై, ఆఫీసుపై ఐటి అధికారులు ఏక కాలంలో దాడి చేసి నిన్నటి నుంచి ఈ రోజు వరకు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ ఆస్తుల లెక్కలన్నీ అధికారులు సమగ్రంగా పర్యవేక్షిస్తున్నారు.
మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.... ఆయన ఆస్తుల వివరాలు, పన్ను చెల్లింపుల రికార్డులు సరిగా లేక పోవడంతో ఐటీ అధికారుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. విచారణ అనంతరం అతన్ని అధికారులు వదిలి పెట్టారు.
బండ్ల గణేష్‌ను ఐటీ ఆఫీసుకు తీసుకెళ్లడంతో ఫిల్మ్ నగర్లో రకరకాల ప్రచారం జరుగుతోంది. తప్పుడు లెక్కలతో ఆయన దొరికి పోయాడనే గాసిప్స్ సైతం వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా..... పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు గణేష్ దగ్గరి వ్యక్తి కవడం, ప్రస్తుతం ఆయన జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.
చిన్న చిన్న పాత్రలు చేస్తూ జూ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన బండ్ల గణేష్.... అనతి కాలంలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసింది. గణేష్ వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నాయని, వారి ఆస్తులకు ఈయన బినామీగా వ్యవహరిస్తున్నాడనే వార్తలు ఆ మధ్య బహిరంగంగానే వినిపించాయి.


Click it and Unblock the Notifications











