సరిలేరు నీకెవ్వరు మరీ బాధపెట్టినట్టుంది!.. బండ్ల గణేష్ సంచలన నిర్ణయం

ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాలు బెడిసి కొట్టొచ్చు. వాటి ఫలితాలు మనల్ని బొక్క బోర్లా పడేయవచ్చు. బండ్ల గణేష్ ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. బండ్ల గణేష్ ఆ మధ్య తీసుకున్న నిర్ణయాలేవీ కలిసి రాలేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. బండ్ల గణేష్ కాస్త బ్లేడ్ గణేష్ అనిపించుకున్నాడు. సరే ఆ ఇమేజ్ నుంచి బయటపడదామని తనకు తెలిసినా, కలిసి వచ్చినా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడా ఫలితం బెడిసి కొట్టింది. దీని పట్ల బండ్ల గణేష్ చాలా విరక్తి చెందాడనే అనిపిస్తోంది. తాజాగా ఓ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలుకూ ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. అందులో బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేశాడు.

తిరగబడిన సరిలేరు ఫలితం..

తిరగబడిన సరిలేరు ఫలితం..

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర అదిరిపోతుందని రిలీజ్‌కు ముందు తెగ ఊదర గొట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి అయితే ప్రతీ ఇంటర్వ్యూలో మరీ ఎక్కువగా చేసి చెప్పాడు. బండ్లన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెచ్చిపోయి మాట్లాడేశాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది.. కానీ తీరా సినిమా చూసే సరికి ఆశ నిరాశ అయింది.

అందరూ తిట్టారట..

అందరూ తిట్టారట..

బండ్ల గణేష్ పాత్రను చూసి ప్రతీ ఒక్కరూ తిట్టారట. ఇంట్లో పిల్లలతో సహా తెలిసిన వాళ్లంతా బండ్ల గణేష్‌ను బాగా వాయించేశారట. ఇలాంటి పాత్ర ఎందుకు చేశావని ప్రతీ ఒక్కరూ అడిగారట. అయితే ఆ మధ్య డైరెక్టర్‌పై బండ్లన్న కాస్త సీరియస్ అయినట్టు, తన పాత్రను బాగా తగ్గించడంతో హర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి.

ఇమేజ్ డ్యామేజ్..

ఇమేజ్ డ్యామేజ్..


సరిలేరు నీకెవ్వరు సినిమాతో పూర్వ వైభవం వస్తుందని ఆశించిన బండ్ల గణేష్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందని హర్ట్ అయ్యాడట. మరీ దారుణంగా ఆ పాత్ర ఉండటం, పట్టుమని పదినిమిషాలు కూడా లేకపోవడం, ఉన్న ఆ సీన్స్ కూడా ఎబ్బెట్టుగా అనిపించడంతో బండ్ల ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారింది.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
ఇక సినిమాల్లో నటించను..

ఇక సినిమాల్లో నటించను..

తాజాగా ఓ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్లన్న సంచలన నిర్ణయం ప్రకటించాడు. సరిలేరులో నటించినందుకు ఆప్తులందరూ తిట్టారని, ఇకపై సినిమాల్లోనే నటించనని చెప్పుకొచ్చాడు. అంటే సరిలేరు ఫలితం బండ్ల గణేష్‌ను బాగా బాధ పెట్టి ఉంటుంది. అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకొని ఉంటాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X