Akira Nandan: పవన్ కళ్యాణ్ వారసుడిపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్.. రామ్ చరణ్‌కు పోటీగా..

సినిమా ఇండస్ట్రీలో అందరిచూపు ఎక్కువగా వారాసులపైనే ఉంటుంది. కాస్త టీనేజ్ వయసు దాటితే చాలు హీరోగా లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటూ రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. నిజానికి కోట్లాదిమంది అభిమానించే హీరోల తనయులు సినిమాల్లోకి రాకుండా ఉండలేరు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ రాబోయే హీరో అకిరా నందన్ అని అందరిలో ఒక నమ్మకం అయితే ఉంది. ఇక ఇటీవల బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సైతం హాట్ టాపిక్ గా మారింది.

 సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా మార్కెట్ పెంచుకున్న పవన్ ప్రతి మూవీతో ఎదో ఒక వండర్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ప్లాప్ అయినా సినిమా కూడా టాప్ ఓపెనింగ్స్ లలో ఒకటిగా నిలుస్తూ ఉంటాయి.

 17 ఏళ్ళ వయసులోకి రావడంతో

17 ఏళ్ళ వయసులోకి రావడంతో

ఇక అలాంటి అగ్ర హీరో నుంచి వచ్చే వారసుడిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ 17 ఏళ్ళ వయసులోకి రావడంతో అతని ఎంట్రీపై అభిమానులు ఒక నమ్మకం అయితే పెరిగింది. తొందరలోనే రావచ్చని అనుకుంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ పూర్తి కాకుండా ఇప్పట్లో లాంచ్ చేసే అవకాశం అయితే లేదు.

క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్

క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్


రేణు దేశాయ్ కూడా ఇదివరకే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అతను మెగాఫ్యామిలీ బిడ్డనే అని సున్నితంగా వివరణ ఇచ్చిన ఆమె ప్రస్తుతం అకిరా నందన్ ఆలోచనల్లో అయితే హీరో అవ్వాలని లేదని అన్నారు. అతను పూర్తిగా ఎడ్యుకేషన్ వైపే దృష్టి పెట్టినట్లు చెబుతూ ఎక్కువగా మ్యూజిక్ నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

అకిరా నందన్ న్యూ లుక్

అకిరా నందన్ న్యూ లుక్


ఇక చాలా కాలం తరువాత అకిరా నందన్ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అకిరా ఇప్పుడు మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇదివరకు లాగా మరీ సన్నగా కాకుండా ఇప్పుడు కాస్త లావయ్యి మీడియం లుక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

చర్చలకు దారితీసిన బండ్ల గణేష్

చర్చలకు దారితీసిన బండ్ల గణేష్

అయితే రీసెంట్ గా బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ - అకిరా దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ నా దేవుడితో నా హీరో అని ట్వీట్ చేయడం సరికొత్త చర్చకు దారి తీసింది. హీరో అనగానే బండ్లగణేష్ నిర్మాతగా సినిమా ఉంటుందని ఎవరికి వారు వార్తలు అల్లేస్తున్నారు. నిజానికి అలాంటి ఛాన్స్ వస్తే బండ్లగణేష్ అయినా వదులుకొడు. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కొడుకును పరిచయం చేయించే ఛాన్స్ వస్తే మాత్రం ఏ మాత్రం తగ్గకుండా సినిమా చేయగలడని చెప్పవచ్చు.

Recommended Video

Sharwanand Sends Legal Notice To His Producers, చిచ్చు పెట్టిన కోట్లు ! || Filmibeat Telugu
రామ్ చరణ్ చేతుల్లోనే..

రామ్ చరణ్ చేతుల్లోనే..

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అకిరా నందన్ బాధ్యతను పూర్తిగా తన పెద్దన్నయ్య రామ్ చరణ్ తీసుకొనున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఫైనల్ గా కొణిదెల ప్రొడక్షన్ లోనే అకిరా నందన్ గ్రాండ్ లాంచ్ ఉంటుందని సమాచారం. మరి అలాంటి రామ్ చరణ్ కు పోటీగా బండ్ల గణేష్ నిలుస్తాడా అనేది మరికొందరి ఆలోచన. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X