ఏపీ నేతను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయిన బండ్ల.. ఇబ్బంది పెడతావో తెలుసంటూనే అష్ట దరిద్రమా అంటూ దారుణ వ్యాఖ్యలు!

నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో వివాదాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఆయన ఈ మధ్య అన్నింటికీ దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన యాక్టివ్ గా లేరు ఏమిటి అని అనుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలక వ్యక్తిగా ఉండే విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే

Recommended Video

Bandla Ganesh Warns MP VijaySai Reddy కమ్మవారి జోలికొస్తే | Oneindia Telugu
విరుచుకుపడ్డారు

విరుచుకుపడ్డారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరున్న ఆ పార్టీ రాజ్యసభ విజయసాయి రెడ్డి మీద బండ్ల గణేష్ ట్వీట్లతో విరుచుకుపడ్డారు. బండ్ల అసలు ఆయన మీద ఎందుకు విరుచుకుపడ్డారు తెలియదు కానీ విజయ సాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ కులాల గురించి కూడా బండ్ల గణేష్ హాట్ కామెంట్లు చేశారు.

 కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు

కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు


''మీకు కులం నచ్చకుంటే కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి, చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి, ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు, ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు'' అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

 వైయస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం

వైయస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం


''అయ్యా ఆంధ్రకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలి చేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది'' అని వార్నింగ్ ఇచ్చారు. ''నాకు వైయస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం, నువ్వు పెద్ద దరిద్రానివి, మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నవ్, కేసీఆర్ ను చూసి నేర్చుకో'', అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు'' అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

 ఇబ్బంది పెడతావో తెలుసు

ఇబ్బంది పెడతావో తెలుసు


నీకు చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచి చూపిస్తారు'' అంటూ బండ్ల ఘాటుగా పేర్కొన్నారు. ''నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు కానీ కులాన్ని కాదు...నిన్ను జైల్ కు పంపింది... కమ్మ వారు కాదు, త్వరలో నువ్వు జగన్ కి వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి... ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు అన్నిటికి సిద్ధపడే చేస్తున్నా'' అంటూ బండ్ల పేర్కొన్నారు.

కళ్ళు నెత్తికెక్కి

కళ్ళు నెత్తికెక్కి


కమ్మ వారిని తిట్టాడాన్ని తట్టుకోలేక పోతున్న, నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు, దయచేసి కులాన్ని తిట్టకు, ఇదేనా నీ సంస్కారం ? నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు'', కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు'' అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X