Vakeel saab trailer.. అభిమానుల విధ్వంసం.. జాగ్రత్త అంటూ బండ్ల గణేష్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలైన దాదాపు 24 గంటలు అవుతున్నా కూడా ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. ట్విట్టర్,యూట్యూబ్ ఇలా సామాజిక మాధ్యమాలన్నింట్లోనూ వకీల్ సాబ్ ట్రైలర్ దూసుకుపోతోంది. అయితే మొదటిసారిగా వకీల్ సాబ్ ట్రైలర్ ఈవెంట్లను నెవ్వరో బిఫోర్ అనేలా ప్లాన్ చేశారు.

థియేటర్లలో వకీల్ సాబ్..

థియేటర్లలో వకీల్ సాబ్..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లను మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ థియేటర్లలోనే నేరుగా వకీల్ సాబ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అలా 70 ఎంఎం స్క్రీన్స్‌లో వకీల్ సాబ్ ట్రైలర్‌ను చూడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవుధుల్లేకుండాపోయాయ్.

జాతరను తలపించేలా..

జాతరను తలపించేలా..

ఇక వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా థియేటర్ల వద్ద జాతర కనిపించింది. ప్రతీ థియేటర్ హౌస్ ఫుల్ అయింది. భారీ కటౌట్లు, పూజలు, పాలాభిషేకాలు ఇలా రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు సాహసాలు చేశారు.

 గ్లాసులు బద్దలుకొట్టుకుని..

గ్లాసులు బద్దలుకొట్టుకుని..

వకీల్ సాబ్ ట్రైలర్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కొన్ని చోట్ల అభిమానులకు గాయాలయ్యాయి. ఇంకొన్ని చోట్ల థియేటర్లు ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయి. ఈ మేరకు వైజాగ్‌ సంఘం థియేటర్ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడయో వైరల్ అవుతోంది.

జాగ్రత్త అంటూ..

జాగ్రత్త అంటూ..

'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం అండి. ఇది వైజాగ్ సంఘం థియేటర్లో ఈ సన్నివేశం' అంటూ ఓ అభిమాని ట్వీట్ వేశాడు. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. జాగ్రత్త బ్రదర్ అంటూ తమ అభిమానులకు సూచించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X