twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లేడుతో ఆత్మహత్య చేసుకుంటానన్న బండ్ల గణేష్...వద్దంటున్న ఫ్యాన్స్!

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించడంతో పాటు... బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకన్న బండ్ల గణేష్ ప్రస్తుతం రాజకీయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

    ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా... ఆయన సమాధానాలు ఇచ్చే తీరుతో ప్రజలను నవ్విస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన సీరియస్‌గానే తన ఓపీనియన్స్ చెబుతున్నా... ప్రజలకు మాత్రం కామడీ స్టైల్‌లో రీచ్ అవుతున్నాయి.

    ఆత్మహత్య చేసుకుంటానంటూ ఛాలెంజ్

    ఆత్మహత్య చేసుకుంటానంటూ ఛాలెంజ్

    తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక పోతే మీరు డిసెంబర్ 11న బ్లేడు తీసుకుని రండి, ఇదే ప్లేసులో అందరి ముందు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను, గెలిస్తే మీరు నాకు స్వీట్లు ఇవ్వాలి.... అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

    సినిమా రంగంలోకి రావాలంటున్న ఫ్యాన్స్

    సినిమా రంగంలోకి రావాలంటున్న ఫ్యాన్స్

    అయితే బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములు అనేవి ఎక్కడైనా సహజం. దీని కోసం చావడం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఆత్మహత్య లాంటి పిచ్చి పనులకు పాల్పడ వద్దని, సినిమాల వైపు రావాలని, మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మాకు అందించాలని కోరుతున్నారు.

    చనిపోతే కామెడీ మిస్సవుతాం అంటూ కొందరు...

    చనిపోతే కామెడీ మిస్సవుతాం అంటూ కొందరు...

    అయితే కొందరు మాత్రం బండ్ల గణేష్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోకుండా కామెడీగా చూస్తున్నారు. ‘‘అన్నా మీరు మాకు కావాలి, మమ్మల్ని మరింత నవ్వించాలి, మీరు లేక పోతే కామెడీ మిస్సవుతాం' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

    సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు?

    సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు?

    ఒకప్పుడు టాలీవుడ్లో వరస బ్లాక్ బస్టర్స్ నమోదు చేసిన బండ్ల గణేష్ సినిమాలకు దూరం అవ్వడానికి కారణం వరుస ప్లాపులే అని టాక్. దీంతో పాటు ఓ సినిమా విషయంలో డబ్బు వివాదం కోర్టు వరకు వెళ్లడం కూడా ఆయన సినీ నిర్మాణ రంగానికి దూరం అవ్వడానికి కారణమని అంటున్నారు.

    English summary
    Bandla Ganesh challenged that he would commit suicide if Congress party faces a defeat in the Telangana general polls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X