twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళు కూడా సినిమాలు తీయడం వల్లే ఇలా.. అశ్వినీదత్ కు బండ్ల గణేష్ మద్దతు!

    |

    టాలీవుడ్ లో షూటింగ్స్ ఆగస్టు ఒకటో తారీకు నుంచి నిలిచిపోతాయంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అశ్వినీదత్ ఆ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు పెంచమని అడిగిన వాళ్ళు ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారంటూ పేర్కొనడం కూడా సినీ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఈ విషయం మీద బండ్ల గణేష్ అశ్వినీదత్ కు మద్దతుగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

    అర్హత ఎవరికి లేదని

    అర్హత ఎవరికి లేదని


    అశ్వినీదత్ తాజాగా మీడియాలో చేసిన కామెంట్స్ మీద బండ్ల గణేష్ ఒక ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో తాను అశ్వినీదత్ చేసిన కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. సీనియర్ నిర్మాతగా అశ్వినీదత్ కు 50 ఏళ్ల సినీ నిర్మాణ రంగంలో అనుభవం ఉందని ఆయన అన్నారు. అలాగే ఒక హీరోను లేదా డైరెక్టర్ ను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పే అర్హత ఎవరికి లేదని అలా అడగకూడదని అన్నారు.

    కామెంట్ల మీద

    కామెంట్ల మీద

    కారులో రకాలు ఉంటాయంటూ అనేక కార్ల పేర్లు ప్రస్తావించిన బండ్ల గణేష్ అవన్నీ కార్లు అయినా ఒక్కో కారుకి ఒక్కో రేటు ఉన్నట్లే అందరూ హీరోలే అయినా ఒక్కొక్కరి హీరోకి ఒక్కో రేటు ఉంటుందని అన్నారు. ఎవరిని వాళ్లకు ఉంటుందన్న బండ్ల గణేష్ మనకు నచ్చి మనం ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలిసినప్పుడు మాత్రమే హీరోని అప్రోచ్ అయ్యి సినిమా చేయాలని అన్నారు. సినీ పరిశ్రమ బాగోవడం కోసం హీరోల రెమ్యూనరేషన్ తగ్గించాలని అనడం తప్పంటూ ఆయన నిర్మాతలు చేస్తున్న కామెంట్ల మీద ఖండించారు.

    నిరాశ పరచలేదని

    నిరాశ పరచలేదని

    అంతేకాక అసలు కాల్ షీట్లకు షీట్లకు తేడా తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని, అసలు షూటింగ్ కోసం ఏ లైట్స్ వాడుతారు, ఏ లొకేషన్ కి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియని వాళ్ళు సినిమాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఒక నటుడిగా మేనేజర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రొడ్యూసర్ గా పని చేశానని అన్నారు. తనకు ఎలాంటి గాడ్ ఫాదర్లు లేకపోయినా ఇండస్ట్రీ తనను ఎప్పుడూ నిరాశ పరచలేదని అన్నారు.

     ఐదు నిమిషాల పాటు

    ఐదు నిమిషాల పాటు


    ఇక ప్రొడ్యూసర్స్ గిల్డ్ లాంటివన్నీ వేస్ట్ అని ఒక చాంబర్, ఒక కౌన్సిల్ ఉండాలి అవి చెప్పిన మాటలకే కట్టుబడి ఉండాలని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అసలు సినిమాలు తీయని వాళ్ళు కూడా గిల్డ్ లో ఉన్నారని అసలు వాళ్ళకి ఏం తెలుసు అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. సుమారు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ఆడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

    సినిమాలు తీయడం వల్లే

    సినిమాలు తీయడం వల్లే

    అసలు కొత్తగా ఏర్పడిన నిర్మాతల గిల్డ్ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాస అని ఆయన పేర్కొన్నారు. అసలు షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు ప్యాకప్ చెప్పాలో తెలియని వాళ్ళు కూడా సినిమాలు తీయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఇక బండ్ల గణేష్ సహా మరికొందరు నిర్మాతలు కూడా అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలపై తమ మద్దతు వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    bandla ganesh supports ashwini dutt comments on producers, he says ashwini dutt comments are hundred percent correct
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X