దెబ్బకు చేతులెత్తి దండం పెట్టేశాడు.. బండ్ల గణేష్‌కు అదో పీడకల!!

సినీ తారల్లో కొందరికి రాజకీయాలు అచ్చి వస్తాయి. కొందరికి అవి పీడకలల్లా వెంటాడుతాయి. అయితే బండ్ల గణేష్ రాజకీయాలు బాగానే గుణపాఠాలు నేర్పినట్టు కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఎన్నికల సమయంలో చేసిన కామెంట్లు, విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఎన్నికల్లో ఘోరమైన దెబ్బ తిన్న తరువాత బండ్ల గణేష్ పూర్తిగా మారిపోయాడు. రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయాడు.

రాజకీయాలకు స్వస్తి..

రాజకీయాలకు స్వస్తి..


బండ్ల గణేష్ రాజకీయాలకు దూరం అంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తూనే ఉన్నాడు. అటు వైపు వెళ్లి తప్పు చేశానని, తనకు అందరూ కావాల్సిన వాళ్లేనని, పొలిటికల్ జర్నీ వల్ల అందరూ దూరమవుతున్నారని అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు ఆ మధ్య చెప్పుకొచ్చాడు.

సినిమాయే జీవితం..

సినిమాయే జీవితం..

ఇక తనకు పేరును తీసుకొచ్చిన సినిమా కోసమే తన జీవితాన్ని ఉపయోగిస్తానని, సినిమానే తన జీవితం అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. అందుకు అనుగుణంగానే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ క్యారెక్టర్ చేసి కమ్ బ్యాక్ ఇద్దామని అనుకున్నాడు. అది ఆ ప్రయత్నం కూడా విఫలమైంది.

సినిమాల నిర్మాణంపై..

సినిమాల నిర్మాణంపై..

ఇక సినిమాల్లో తాను నటించనని నిర్మొహమాటంగా చెప్పేశాడు. నటిస్తే కేవలం తనకు మాత్రమే పేరు వస్తుందని, నిర్మిస్తే తనతో పాటు వంద మంది బతుకుతారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఓ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇటీవలె ఆలీతో సరదాగా షోలో చెప్పేశాడు.

Recommended Video

Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
ఆ ప్రశ్నకు చేతులెత్తి దండం..

ఆ ప్రశ్నకు చేతులెత్తి దండం..


తాజాగా ఓ నెటిజన్ బండ్ల గణేష్‌ను ఓ ప్రశ్న సంధించాడు. అసలే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్.. ఆ ట్వీట్‌కు వెంటనే స్పందించాడు. అన్న బీజేపీలో చేరుతున్నావా? అని అడిగేశాడు. ఆ ట్వీట్‌కు ఖంగుతిన్న బండ్ల గణేష్ నో పాలిటిక్స్ బ్రదర్ అంటూ చేతులెత్తి దండం పెట్టేశాడు. పాపం బండ్లన్నను రాజకీయం పీడకలలా వెంటాడుతూ ఉన్నట్టుంది. అలా అడగడంతో చేతులెత్తేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X