twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. బండ్ల గణేష్ అభయం... టెన్షన్ పెట్టుకోకండి, అంతా మీ వెంట ఉన్నారు!

    |

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఏడ్చిన అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే బండ్ల గణేష్ ఈ అంశం మీద ఆసక్తికరంగా స్పందించారు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా చెప్పుకునే ఆయన చంద్రబాబుని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

     వాగ్వాదం

    వాగ్వాదం

    ఈ రోజు ఏపీ అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో రచ్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. ఇరు వైపుల నుంచి పెద్దయెత్తున నినాదాలు చేశారు.

     పరువు తీస్తున్నారు

    పరువు తీస్తున్నారు

    ఆ తర్వాత చంద్రబాబు తనయుడు లోకేష్ పుట్టుకను ఉద్దేశిస్తూ కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు చంద్రబాబు తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందారు. అసెంబ్లీ సమావేశాల నుంచి చంద్రబాబు వాకౌట్ చేసి చేశారు. తన పరువు కాకుండా, కుటుంబ పరువును తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు అందరికీ నమస్కరిస్తూ సభ నుంచి నిష్క్రమించారు.

    తీవ్రస్థాయిలో ఎమోషనల్

    తీవ్రస్థాయిలో ఎమోషనల్

    ఆ తరువాత సభలో తన భార్య గురించి మాట్లాడటం మీద పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్రస్థాయిలో ఎమోషనల్ అయిన బాబు. కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానన్నారు.

     అన్ని విధాలా అవమానిస్తుంది

    అన్ని విధాలా అవమానిస్తుంది

    రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా అవమానిస్తోందని అయినా అన్నీ భరించాం అని, అయినా కూడా అవమానిస్తునే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నేతలను ఎన్నడూ అవమానించలేదు అని, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు.

    Recommended Video

    Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
    వ్యక్తిత్వ హననానికి

    వ్యక్తిత్వ హననానికి

    'నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించాం. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారు. అన్నీ భరించి అసెంబ్లీకి వస్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారు. నా భార్య వ్యక్తిత్వ హననానికి వైసీపీ పాల్పడుతోందన్నారు.

    ఆంధ్రప్రదేశ్ మీ వెంట ఉంది

    అందుకే పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ కూడా ఇది చూసి తట్టుకో లేకపోయారు. సార్ మీరు టెన్షన్ పెట్టుకోకండి, చంద్రబాబు గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మీ వెంట ఉందని ఆయన అన్నారు. మొత్తం మీద చంద్ర బాబు ఎపిసోడ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది.

    English summary
    Bandla Ganesh made tweet about chandrababu crying.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X