శబరిలో అయ్యప్ప, శ్రీశైలం మల్లప్ప, హైదరాబాద్లో పవనప్ప...

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం రేపు విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో భారీ నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌కు పవన్ అంటే చాలాచాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని తనదైన రీతిలో అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటాడు.

తాజాగా పవన్‌ నటించిన ‘గోపాలగోపాల' సినిమాకు ఆల్‌దిబెస్ట్‌ చెబుతూ ట్విట్టర్‌ ఇలా స్పందిచాడు..‘‘శబరిలో అయ్యప్ప, శ్రీశైలంలో మల్లప్ప, హైదరాబాద్‌లో పవనప్ప..గోపాల గోపాల బ్లాక్‌ బస్టరరప్ప అంటూ ‌'' అంటూ ట్విట్‌ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Bandla Ganesh tweet about Gopala Gopala

'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X