twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బండ్ల గణేష్‌కు ఇలాంటివి అలవాటేగా...?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన మాటలతో, చేష్టలతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. భారీ బడ్జెట్లు పెట్టి పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలను పెట్టి సినిమాలు తీస్తాడు. ప్రస్తుతం ఏ సినిమా సెట్లో ఉంటే ఆ సినిమా గురించి పొగడ్తలు తెగ గుప్పిస్తుంటారు.

    ఆయన ఏదైనా సినిమా గురించి మాట్లాడితే....‘బ్లాక్ బస్టర్' అనే పదం తప్పకుండా వాడతారు. అందుకే ఆయన్ను అంతా బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలస్తుంటాడు. తాజాగా ‘టెంపర్' చిత్రాన్ని నిర్మిస్తున్న బండ్ల గణేష్ ఈ సినిమా గురించి తన ట్విట్టర్లో ట్వీటాడు. ‘ఇపుడు నా ఆకాంక్ష, డ్రీమ్, గోల్ ఒక్కటే....‘టెంపర్' చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేయాలి' అంటూ ట్వీట్ చేసారు. పూరి-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. తన ట్వీట్ ద్వారా గణేష్ పూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత జోష్ నింపారు.

    తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి 18న ‘టెంపర్' ఆడియో వేడుక జరుపాలని చూస్తున్నట్లు టాక్. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

    Bandla Ganesh tweet about ‘Temper’

    ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    ”Now my ‘AIM’ my ‘DREAM’ my ‘GOAL’, Its to make TEMPER!!! BLOCKBUSTER HIT!!!!”, Bandla Ganesh said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X