మహేష్ బాబు న్యూ లుక్‌పై బండ్ల గణేష్ కామెంట్స్.. అలా ఉన్నాడట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా ఆడియెన్స్ చూపు తిప్పుకోలేరు. ఆయన వయసు 44 అంటే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ ని మెయింటైన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. గ్లామర్ తోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిన మహేష్ బాబు రీసెంట్ గా మరో ఫొటోతో మరొక షాక్ ఇచ్చాడు.
తన ఇద్దరు పిల్లలతో కలిసి సింపుల్ స్మైల్ తో సెల్ఫీ తీసుకోవడం ముచ్చటగా అనిపిస్తోంది. ఇక మహేష్ తన స్టైలిష్ లుక్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పిల్లలకు అతను అన్నయ్యాల ఉన్నడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెలబ్రెటీస్ సైతం ఎవరి స్టయిల్లో వారు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో మహేష్ లుక్ పై స్పందించాడు.

మహేష్ సర్ మీరు హాలీవుడ్ సూపర్ స్టార్ లా ఉన్నారని బండ్ల గణేష్ స్వీట్ గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరగా బండ్ల గణేష్ మహేష్ బాబు సరిలేరు నికెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో తన రియల్ లైఫ్ కాంట్రవర్సీలపై కూడా గణేష్ సెటైర్స్ వేసుకోవడం జనాలను ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











