పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్.. అనుమానాలు రేకెత్తిస్తున్న ట్వీట్
Recommended Video
సక్సెస్ సంగతి అటుంచితే.. సినీ నటుడి గానూ, రాజకీయ వేత్త గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత నిర్మాతగా మారి.. రాజకీయరంగంలోకి కూడా దిగేశాడు ఈ కమెడియన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెగ హంగామా చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈయన.. ఎలక్షన్స్ అనంతరం సైలెట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు తిరిగి మరో యూ టర్న్ తీసుకునే దిశగా బండ్ల గణేష్ అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

బండ్ల గణేష్ ఈజ్ బ్యాక్.. జనాల్లో చర్చలు
గత కొంతకాలంగా చడీచప్పుడూ లేకుండా ఉన్న బండ్ల గణేష్.. తిరిగి రాజకీయాల వైపు చూస్తున్నాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఈ కమెడియన్ ఇప్పుడు మళ్ళీ పవన్ పాట పాడుతున్నాడు. ఉన్నట్లుండి ఈయన మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై అనేయడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది.

భయంతో రాలేదు- బాధ్యతతో వచ్చాను
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి సోషల్ మీడియా వేదికగా తన సపోర్ట్ తెలిపాడు బండ్ల గణేష్. ఈ మేరకు జనసేన లోగోతో కూడిన పవన్ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోపై ''నేను భయంతో రాలేదు- బాధ్యతతో వచ్చాను'' అని రాసి ఉండటం విశేషం. ఈ ఫొటో షేర్ చేసిన బండ్ల గణేష్.. ''ఇది నిజం'' అంటూ ట్యాగ్ చేశాడు.

పవన్‌తో స్నేహం.. కాంగ్రెస్ కండువా
సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్- బండ్ల గణేష్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కోసం తాను ప్రాణాలైనా ఇస్తానని పలుసార్లు బాహాటంగా ప్రకటించాడు బండ్ల గణేష్. అందుకే పవన్ పార్టీ పెట్టిన కొత్తలో ఆయన ఆ పార్టీలో చేరతాడని, తెలంగాణలో జనసేనను చూసుకుంటాడని అనుకున్నారంతా. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు గణేష్.

త్వరలోనే జనసేన లోకి.. అనుమానాలకు రెక్కలు
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పెట్టాక కూడా పవన్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడని బండ్ల గణేష్.. ఇప్పుడేమో ఇలా పవన్‌ని పైకెత్తుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాను త్వరలోనే జనసేన కండువా కప్పుకొని పవన్ వెంటే ఉండనున్నానని చెబుతూ బండ్ల గణేష్ ఇలా హింట్ ఇచ్చాడని అంటున్నారు కొందరు.
బండ్ల గణేష్ స్కెచ్.. ఇకపై మనోడు!!
ఇదిలా ఉంటే సినిమాల్లోనూ యూ టర్న్ తీసుకున్నాడు బండ్ల గణేష్. ఇటీవలే మహేష్ బాబు హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇకపై సినిమాలతో బిజీ కావాలని చూస్తున్నాడు. అంటే ఈ లెక్కన చూస్తే బండ్ల గణేష్ ఈ సారి మరో బలమైన స్కెచ్ వేసి రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది కదూ!.


Click it and Unblock the Notifications











