భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ.. త్రివిక్రమ్‌ను పరోక్షంగా టార్గెట్ చేసిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు భారీ బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాతల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని మాత్రమే కాకుండా భక్తుడు కూడా. పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్ కల్యాణ్ పట్ల ప్రేమ, అభిమానాలను తన మాటల రూపంలో చెప్పి ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నారు.
అయితే పవన్ కల్యాణ్, బండ్ల గణేష్‌కు మధ్య ఇటీవల కాలంలో దూరం పెరిగినట్టు కనిపిస్తున్నది. అయితే తమ మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే తాజాగా గురూజీ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరింత సంచలనం రేపాయి. ఆ ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు బండ్ల గణేష్‌కు కోల్డ్ వార్ నడుస్తున్నది. ఈ వ్యవహారంపై త్రివిక్రమ్ మౌనంగా ఉన్నప్పటికీ.. బండ్ల గణేష్ పరోక్షంగా ఆయనను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం తరచూ కనిపిస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే తనకు పవన్ కల్యాణ్‌కు దూరం పెంచాడని తన ఆక్రోశాన్ని బండ్ల గణేష్ వెల్లగక్కడం చర్చనీయాంశమైంది.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ వరుస ట్వీట్లు వేశాడు. గురూజీ అంటూ.. సాగినంత కాలం నా అంతవాడు లేడందరు.. సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు అంటూ పాత తెలుగు సినిమా పాటను ట్వీట్‌గా వేశాడు. చెప్పడమే నా ధర్మం.. వినకపోతే నీ ఖర్మ అంటూ పవన్‌ను ఉద్దేశించి కామెంట్ చేసినట్టు స్పష్టమైంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తనదైన శైలిలో బండ్ల గణేష్ మరో ట్వీట్ వేశాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్లపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.
అయితే బండ్ల గణేష్ ట్వీట్లపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. గురూజీ ఏం చేశాడాన్న.. గరిట కాల్చి నీ పిర్రమీద వాత పెట్టాడా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బండ్ల అన్న ఈ ముసుగులో గుద్దులాట వద్దు, నువ్వు చెప్పు గురూజీ గాన్ని వేద్దామా ? వద్దా ? ఒక 100 కోళ్లు ఎగిరిపోయాయి అనుకో ... అంటూ మరో నెటిజన్ అన్నాడు.
బండ్ల గణేష్ ట్వీట్పై మరో నెటిజన్ స్పందిస్తూ.. కళ్యాణ్ గురూజీకి ఎంత చనువు ఇచ్చారో.. మీకు కూడా అంతే ఇచ్చి ఉంటారు.. కానీ మీరు దాన్ని నిలబెట్టుకో లేదేమో.. గబ్బర్ సింగ్ టైమ్ లో అన్నారు ఈ సంవత్సర కాలంలో బాబుని కలవని రోజు లేదు అన్నారు. అప్పుడు మీరు ఏమైనా గురూజీ పంపిస్తెనే కలిసేవాల్ల కళ్యాణ్‌ను.. స్వయంగా మీరే ఆ సాన్నిహిత్యం పోగొట్టుకున్నారు అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేయడం కనిపించింది.


Click it and Unblock the Notifications











