ఇద్దరు మెగాస్టార్ల మధ్య బండ్ల గణేష్.. నాటి ఫోటోను షేర్ చేయడంతో అంతా షాక్
బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి ఎంత విధేయంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ మొదలైనప్పటి నుంచి బండ్ల గణేష్ వెంట ఉంటూనే వచ్చాడు. సైడ్ క్యారెక్టర్‌లు చేసుకుంటూ వచ్చిన బండ్ల గణేష్‌ను పవన్ కళ్యాణ్ చివరకు నిర్మాతగా మార్చేశాడు. అయితే బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీ అంటే ఎనలేని భక్తి. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ప్రశంసించాలంటే అది బండ్ల గణేష్ తరువాతే అనేలా ఉంటుంది.
Recommended Video

మెగా వీరాభిమాని..
మెగా హీరోలకు బండ్ల గణేష్ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. స్టేజ్ ఎక్కితే మెగా హీరోలను ఆకాశంలోకి ఎత్తేసేలా మాటల ప్రవాహాన్ని వదులుతాడు. బండ్ల గణేష్ మాటలు తూటాల్లా పేలుతుంటాయి. మరీ ముఖ్యంగా మెగా వీరాభిమానిగా పవన్ కళ్యాణ్, చిరంజీవిల గురించి చెప్పే మాటలు మార్మోగుతూనే ఉంటాయి.

బండ్ల గణేష్ ఇంటికి..
బండ్ల గణేష్ ఇంట్లో జరిగే శుభ కార్యాలకు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తుంటాడు. గృహ ప్రవేశ వేడుకకు, బండ్ల గణేష్ సోదరుడి కూతురి పెళ్లికి ఇలా ప్రతీసారి చిరంజీవి ప్రత్యక్షమవుతుంటాడు. బండ్ల గణేష్‌పైనా మెగా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.

సినీ అవకాశాలు..
బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారి మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. తీన్‌మార్, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలా అంటూ అప్పట్లో బండ్ల గణేష్ రచ్చ రచ్చ చేశాడు. ఇక మళ్లీ పవన్ కళ్యాణ్‌తో మరో ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడు.

నాటి ఫోటో..
బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీకి ఉన్న బంధం తెలిసేలా ఓ ఫోటోను షేర్ చేశాడు. చిరంజీవి ముందు ఎంత విధేయంగా ఉండేవాడో చెప్పేలా నాటి ఫోటోను షేర్ చేశాడు. ఇందులో ఒక్క మెగాస్టార్ కాదు ఇద్దరు మెగాస్టార్లు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇద్దరు మెగాస్టార్లు..
1996 మాస్టర్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటో అంటూ బండ్ల గణేష్ పాత రోజులకు తీసుకెళ్లాడు. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, అమితాబ్ బచ్చన్‌లతో ఫోటో దిగాను అంటూ చెప్పుకొచ్చాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ బండ్ల గణేష్ దండం పెట్టేశాడు. తమ్ముడు గణేష్‌కు ప్రేమతో అంటూ చిరంజీవి ఆటో గ్రాఫ్ పెట్టేశాడు.


Click it and Unblock the Notifications











