twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరిహద్దుల్లో త్యాగం చేసే సైనికుడికి గుర్తింపు లేదు.. హీరో సూర్య భావోద్వేగం

    |

    ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మించారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు.

    తెలుగులో భారీ ఎత్తున

    తెలుగులో భారీ ఎత్తున

    సూర్య మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి థాంక్స్. మా టీమ్ అందరి కలను ఆయన నిజం చేశారు. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. లైకా ప్రొడక్షన్స్, ఎన్వీ ప్రసాద్ గారి అమేజింగ్ అసోసియేషన్ గురించి నాకు ఈ రోజు తెలిసింది. ఇక్కడికి వచ్చిన సురేష్ బాబుగారికి థాంక్స్ అని అన్నారు.

    సైనికులకు గుర్తింపు లేదు

    సైనికులకు గుర్తింపు లేదు

    వర్కింగ్ డే అయినప్పటికీ... ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మీరు ఇచ్చే కిక్, హై డిఫరెంట్. ఈ 'బందోబస్త్' కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుంచి కెవి ఆనంద్ సార్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త. నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మనం కష్టపడినందుకు జీతం వస్తుంది అని సూర్య పేర్కొన్నారు.

    సరిహద్దులో ప్రతీ రోజు

    సరిహద్దులో ప్రతీ రోజు

    మన దేశం కోసం, భద్రత కోసం ఎంతో మంది నిజమైన హీరోలు, గుర్తింపుకు నోచుకొని హీరోలు సరిహద్దుల్లో ప్రతి రోజు నిలబడతారు. వాళ్లను నేను వ్యక్తిగతంగా కలవడం గొప్ప అనుభవం. దేశానికి ఎంతో సేవ చేసిన వారందరూ వేదికల మీదకు ఎప్పుడూ రారు. గుర్తింపు కోరుకోకుండా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు. ఆ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ 'బందోబస్త్'. వాళ్లు ఏం చేస్తారో చూపించే ప్రయత్నం చేశాం. నేను ఈ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోగా చేశా అని సూర్య తెలిపారు.

    బందోబస్త్ సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్ కాకుండా

    బందోబస్త్ సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్ కాకుండా

    ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి భద్రతగా నిలిచే ఫస్ట్ సర్కిల్ లో ఎస్.పి.జి కమాండోలు ఉంటారు. ఎవరైనా ఫైరింగ్ చేస్తే వాళ్లు పారిపోరు. తమ గుండెలు చూపిస్తారు. కుటుంబ జీవితాలను త్యాగం చేస్తారు. అటువంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవం ఈ సినిమా. 'బందోబస్త్'తో వాళ్లకు థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. 'బందోబస్త్' సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే ఇవ్వదు, ఇంతకు ముందు ఎన్నడూ సినిమాల్లో చూడని కొత్త వాతావరణంలోకి ప్రేక్షకులను తీసుకు వెళుతుంది అని సూర్య అన్నారు.

    పలు కోణాల్లో సినిమా కథ

    పలు కోణాల్లో సినిమా కథ

    ప్రధానమంత్రి కార్యాలయం, డిఫెన్స్, సెక్యూరిటీ, వ్యవసాయం... సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన ఒక వ్యక్తి రెబెల్ గా మారితే... అతను ఏం చేయగలడు? అతను ఎందుకు రెబెల్ గా మారాడు? అనేది సినిమాలో చూడండి. సినిమాలో చాలా చాలా కథలు ఉన్నాయి. సినిమాలో నేను మాత్రమే కాదు... మోహన్ లాల్ గారు, ఆర్య, బోమన్ ఇరానీ, కిరణ్ ఉన్నారు. అన్ని కథలు కూడా ఉన్నాయి. నాతో సన్నివేశాలకు మాత్రమే సాయేషా పరిమితం కాలేదు. కథను మార్చే పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇదొక ఆల్ రౌండ్ ఎంటర్టైనర్. కెవి ఆనంద్ గారితో నేను చేసిన మూడో సినిమా 'బందోబస్త్'. ఇందులో మోహన్ లాల్ గారితో పని చేయడం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్" అని సూర్య తెలిపారు.

    Recommended Video

    Bandobast Movie Teaser
    సెప్టెంబర్ 20న రిలీజ్

    సెప్టెంబర్ 20న రిలీజ్

    సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మల్కాపురం శివకుమార్, 'ఠాగూర్' మధు, నటులు రాజ్ కుమార్, రామదాస్, కిరణ్, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుందర్ రాజన్, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు సేల్స్ అండ్ మార్కెటింగ్ చెందిన శరన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Ahead of the release of 'Bandobast' on September 20, a grand pre-release event was held on Friday night at Hyderabad's ITC Kohenur. The event was graced by the beloved and versatile actor Suriya, who was extremely delighted to receive the love of the fans at the event. Also graced by the film's cast crew, producer D Suresh Babu (who launched the theatrical trailer of the film) and others, it was a nice spectacle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X