»   » ‘రజినీకాంత్ డ్రెస్సింగ్ రూమ్’లో దెయ్యాలు...!

‘రజినీకాంత్ డ్రెస్సింగ్ రూమ్’లో దెయ్యాలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల ప్రకారం ఇప్పటివరకు దెయ్యాలను వివిధ రూపాల్లో అంటే తొలి రోజుల్లో తెల్ల చీరల్లో తరువాత వింత రూపాల్లో టెక్నాలజీకి అనుగునంగా సృష్టించుకుంటున్నాం. మరీ కంప్యుటర్ గ్రాఫిక్స్ వచ్చాక వివిధ రూపాల్లో మనం చూస్తున్న శరీరమే లేని ఈ దెయ్యాలు... అసలు మనుషులని చూడగలుగుతాయా..? ఒకవేళ చూస్తే మనుషులు, సమస్త జీవకోటిని ఏ రంగులో చూస్తాయో చెప్పడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం

"బందూక్'' చిత్ర దర్శకుడు లక్ష్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం లో నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తున్న ఒక సమస్య గురించి చూపించబోతన్నాడు. కలర్ విజన్ ఆధారంగా రూపు దిద్దుకాబోతున్న ఈ చిత్రానికి "రజినీకాంత్ డ్రెస్సింగ్ రూమ్'' అనే టైటిల్ ని ఖరారు చేసారు.

Bandook director new movie Rajinikanth Dressing Room

ఈ సినిమా గురించి దర్శుడు మాట్లాడుతూ...
తెలుగు తమిళ్ భాషల్లో రూపు దిద్దికుంటున్న ఈ చిత్రం లో 45 నిమిషాల గ్రాఫిక్స్ కోసం లాస్ఏంజిల్స్ లోని "ప్రిస్విస్ స్టూడియో" తో కలిసి నిర్మిస్తున్నారు. మానవులు ప్రపంచం లోని ఎన్నో వర్ణాలు, ఎన్నెన్నో రంగులను చూస్తున్నట్లుగానే మిగతా ఏ ప్రాణులు చూడలేవు. అంటే మనుషులు చూస్తున్న ప్రకృతిలోని రంగులు కుక్కలకు ఒకరకంగాను, నెమలికి ఒక రకంగాను, పిల్లులకు ఒక రకంగాను, బుల్స్ కి ఒక రకంగాను, క్రిమీ కీటకాలకు, పాములకి, చేపలకి, చివరకు ఎలుకలకు సైతం వివిధ రంగుల్లో కనిపిస్తుంది.

అంటే ఈ ప్రపంచం ఒక జీవికి కనిపిస్తున్నట్టుగా ఇంకో జీవికి కనిపించదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి కలర్ విజన్ తాలుకు నిజాన్ని తెలియపరిచారు. అది ఎలా అనగా జీవకోటి యొక్క ఈ కంటి చూపు తమ తమ శరీర ఆకృతిని బట్టే ఉంటుది. అంటే తమ తమ శరీర ఆకృతి ప్రకారమే సమస్త జీవకోటి ఒకే వస్తువుని కాని, ఒకే పరదేశాన్ని కాని వివిధ రంగుల్లో చూస్తుంటాయి. కంటి చూపుకి శరీర ఆక్రుతే ప్రదాన కారణం. అలాంటప్పుడు శరీరమే లేని ఆత్మలు అసలు ప్రపంచాన్ని చూడగలుగుతాయా? ఒక వేల చూడగలిగితే ఈ ప్రపంచం, ప్రపంచం లోని మనుషులు, వస్తువులు ఈ ఆత్మలకి ఏ రంగులో కనిపిస్తాయి...?

Bandook director new movie Rajinikanth Dressing Room

ఆత్మలను మనం పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడటం మాత్రమే జరుగుతుంది. ( ఎవరైన ఆత్మలని చూసారంటే అది వారి వ్యక్తిగతమే. వాళ్ళ మానసిక స్థితి లేకా భ్రమనో ఆత్మలను చూసినట్లుగా అనుబూతి చెందుతారు) పూర్వకాలం లో ఆత్మలను చూసినట్లుగా, ఆత్మలతో మాట్లాడినట్లుగా, మనిషి శరీరం లో ప్రవేశించిన ఆత్మలను వెల్లగొట్టేందుకు మంత్రగాళ్ళు చేసిన విద్యలన్నీ కల్పితమే లేదా మూడ నమ్మకాలుగా అందరు చెప్తుంటారు. అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అన్నది ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్నే!

Bandook director new movie Rajinikanth Dressing Room

కాని ఈ దెయ్యాలు మనుషులని పట్టి పీడుస్తున్నా, వికృత చేష్టలు చేయించి ఇంకొకరిని బాధించినా ఇదంతా తమ చిరకాల వాంచ తీర్చుకోవడం కోసమే. అంటే తమ తమ కోరికలు తీరిన వెంటనే దెయ్యాలు మనుషుల శరీరాలను విడిచి విముక్తి పొందుతాయని నానుడి. ఈ సినిమా కూడా ఒక సామాజిక కోణం లోనే ఉంటుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న ఈ చిత్రం తాలుకు మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తాము.

English summary
Bandook director new movie 'Rajinikanth Dressing Room' coming soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu